నడిరోడ్డులో అందరి ముందు అలా చేయాలంటే సిగ్గేసింది... అప్పుడే సినిమాలు వదిలేద్దాం అనుకున్నా!

First Published Jun 17, 2021, 10:13 AM IST

అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ కి భక్తులు ఉంటారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన పవన్ కళ్యాణ్ ఇమేజ్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అన్నయ్య చిరంజీవి వారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన పవన్, తన మార్కు మేనరిజం, హీరోయిజంతో స్టార్ గా ఎదిగాడు. 
 
 

పెద్ద స్టార్ అయినప్పటికీ పవన్ తనని తాను గొప్పగా చెప్పుకోడు. నటనలో, డాన్స్ లలో మిగతా వారికంటే నేను వెనుకే అని ఒప్పుకుంటారు. ఆయన ఫ్యాన్స్ మాత్రం మీరు తెరపై కనిపిస్తే చాలు మాకు పండగే అంటూ ఉంటారు.
undefined
25 సినిమాలకు పైగా నటించిన పవన్ బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. చిరంజీవి తమ్ముడిగా పరిచయమై పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
undefined
ఇంతటి అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ కేరీర్ బిగినింగ్ లో నటుడిగా  ఇబ్బందులు ఎదుర్కొన్నారట. మొదట్లో పవన్ కళ్యాణ్ కి అందరి ముందు డాన్స్ లు వేయడం అంటే చాలా సిగ్గుగా, బిడియంగా ఫీల్ అయ్యేవారట.
undefined
సుస్వాగతం మూవీ షూటింగ్ సమయంలో రోడ్డుపై డాన్స్ చేయాల్సి రావడంతో పవన్ కి చాలా భయం వేసిందట. అందరి ముందు అలా డాన్స్ వేయడం అతనికి సిగ్గుగా అనిపించిందట. కానీ తప్పక చేశానని పవన్ చెప్పారు.
undefined
ఆ సమయంలోనే సినిమాలు మన వల్లకాదు వదిలేద్దాం అనుకున్నాడట. ఈ విషయాలన్నీ పవన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పగా, ఆ వీడియో వైరల్ గా మారింది. సుస్వాగతం పవన్ ఖాతాలో పడిన మొదటి సూపర్ హిట్.
undefined
నిజంగా బహిరంగ ప్రదేశాల్లో డాన్స్ లకు భయపడి పవన్ అప్పుడు పరిశ్రమను వదిలేస్తే.. టాలీవుడ్ ఓ స్టార్ హీరోని కోల్పోయేదన్న మాట. తమ్ముడు, బద్రి, ఖుషి వంటి చిత్రాలు పవన్ ని తిరుగులేని హీరోని చేశాయి.
undefined
ఇక పొలిటికల్ లీడర్ గా మారిన పవన్ ఫ్యాన్స్ కోసం రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వకీల్ సాబ్ తో ఫ్యాన్స్ దాహం తీర్చిన పవన్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు.
undefined
click me!