ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు... పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారా?

Published : May 08, 2024, 05:40 PM IST

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎవరిదో తేల్చేశాడు. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కూటమి వర్సెస్ వైఎస్సార్సీపీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా 2024లో సీఎం పీఠం ఎవరిదో తేల్చేశాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.   

PREV
16
ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు... పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారా?
Pawan Kalyan

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హీట్ నెలకొని ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో ఎన్నికలు మరింత ప్రత్యేకం అని చెప్పాలి. 
 

26
chandrababu naidu

అధికారిక వైఎస్సార్సీపీని గద్దె దింపాలని బీజేపీ+టీడీపీ+జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఇటు వైఎస్సార్సీపీ అటు ఎన్డీయే కూటమి అధికారం మాదే అంటూ విశ్వాసం ప్రకటిస్తున్నాయి. కాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేశాడు. వారి వారి జాతకాల ఆధారంగా ఆయన ఈ అంచనా వేశాడు.

36
Pawan Kalyan

వేణు స్వామి జ్యోతిష్యం ప్రకారం ఎన్డీయే కూటమికి షాక్ తప్పదట. మరలా వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపడతాడట. పవన్ కళ్యాణ్-చంద్రబాబు జాతకాల రీత్యా పొత్తు వలన పెద్దగా ప్రయోజనం లేదని ఆయన అంటున్నారు. వేణు స్వామి మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో మోసపోవడం ఖాయం. 
 

46
Pawan Kalyan

గ్రహాల రీత్యా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లవి ప్రతికూల నక్షత్రాలు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ ది ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రెండు నక్షత్రాలకు అసలు పొసగదు. కాబట్టి వీరిద్దరూ పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు, అన్నారు. 
 

56
chandrababu naidu -pawan kalyan

ఇంకా మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల నక్షత్రాల ప్రభావం కూటమి మీద పడుతుంది. దాని వలన ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. కూటమికి ఓటమి తప్పదు. మళ్ళీ వైఎస్సార్సీపీ ఏపీలో గెలిచి అధికారం చేపడుతుంది. పవన్ కళ్యాణ్ కి సీఎం అయ్యే యోగం లేదు. అది ఎప్పటికీ జరగదు.

66
Pawan Kalyan

నాకు పవన్ కళ్యాణ్ పై ఎలాంటి ద్వేషం లేదు. ఆయన జాతకం ప్రకారమే చెబుతున్నాని, అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురంలో గెలిచేది లేనిది వేణు స్వామి చెప్పలేదు. వేణు స్వామి కామెంట్స్ ఏపీలో కాకరేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు వేణు స్వామి మీద మండిపడుతున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories