దీంతో బ్యాక్ టూ బ్యాక్ మూడు హిట్లతో విజయ్ రేంజ్‌మారిపోయింది. స్టార్ స్టేటస్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, బన్నీ లాంటి వాళ్లు ఆయన్ని అభినందించారు. అదే సమయంలో అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఒకప్పుడు ఉదయ్ కిరణ్, పవన్ కళ్యాణ్, తరుణ్‌లకు ఎలా అయితే ఫాలోయింగ్ వచ్చిందో, విజయ్‌కి ఆ రేంజ్ క్రేజ్ రావడం విశేషం. ఇండస్ట్రీ మొత్తం అతని గురించే చర్చ. తనగురించే అంతా మాట్లాడుకునేలా చేశాడు విజయ్. కానీ ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. తన రేంజ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు విజయ్. `ఖుషి` ఫర్వాలేదనిపించుకోగా, ఇటీవల వచ్చిన `ఫ్యామిలీ స్టార్` డిజాప్పాయింట్ చేసింది.