కన్నప్ప కల్పితం కాదు, మనోజ్ ట్వీట్ పై మంచు విష్ణు ఏమన్నాడంటే?

Published : Jun 26, 2025, 08:50 PM IST

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న రిలీజ్  కాబోతోంది.  బాలీవుడ్ మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈసినిమా నుంచి వచ్చిన ప్రమోషన్ వీడియోస్ కన్నప్పపై అంచనాలు పెంచాయి. ఈ క్రమంలో  కన్నప్ప టీం మీడియాతో ముచ్చటించింది. 

PREV
18

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈసినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు. 

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో విష్ణు మంచు, కన్నప్ప టీం మీడియాతో ముచ్చటించింది. సినిమాకు సబంధించిన విషయాలను మాట్లాడటంతో పాటు మీడియా సందేహాలకు సమాధానాలు కూడా చెప్పారు.

28

మనోజ్ ట్వీట్ పై మంచు విష్ణు కామెంట్స్

ఈసందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాకు సబంధించిన మనోజ్ చేసిన ట్వీట్ పై అభినందించారు. అయితే తన పేరు ప్రస్తావించకపోవడంపై స్పందించడానికి నిరాకరించారు. ఇక ఈసినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘కన్నప్ప’కు ఇప్పటి వరకు 1 లక్ష 14 వేల టికెట్లు అడ్వాన్స్ బుక్ అయ్యాయి. ఇంతటి రెస్పాన్స్ చూసి నాకు ఆనందమేస్తోంది. ఇదంతా శివ లీల అనిపిస్తుంది. ‘కన్నప్ప’ మీద ఇంత పాజిటివిటీ వస్తుందని ప్రారంభంలో ఎవ్వరూ నమ్మలేదు. అది వారి తప్పు కాదు. ఇప్పుడు ‘కన్నప్ప’ మీద ఫుల్ పాజిటివిటీ వచ్చింది.

38

కన్నప్ప టికెట్ రేట్లు ఎందుకు పెంచలేదు?

‘కన్నప్ప’ చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడాలని కోరుకుంటున్నారు. అందుకే నేను టికెట్ రేట్లు పెంచడం లేదు, అంతే కాదు ఈ మూవీని పిల్లలే ఎక్కువగా చూడాలని అనుకుంటున్నారు. అందుకే కుటుంబాలకు భారం కావొద్దని టికెట్ రేట్లు ఎక్కువగా పెంచ కూడదని నిర్ణయం తీసుకున్నాము. ఏపీలో కొన్ని చోట్ల మాత్రమే రేట్లు పెంచాం. ప్రభాస్‌కి ఇప్పటికే నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆ దేవుడి దయవల్ల నేను కన్నప్ప విషయంలో ఎప్పుడూ ఆర్థిక కష్టాల్ని ఎదుర్కోలేదు. నా తండ్రి మోహన్ బాబు గారు, విజయ్, వినయ్ గారు నా వెన్నంటే ఉండి అంతా చూసుకున్నారు. కన్నప్ప కోసం మా టీం పడినంత కష్టాన్ని నేను అయితే పడలేదు అన్నారు.

48

కన్నప్పలో మంచు విష్ణు నలుగురు పిల్లలు

నా నలుగురు పిల్లలు ఈ చిత్రంలో నటించారు. ఓ తండ్రిగా నా పిల్లల్ని తెరపై చూడటం ఆనందంగా ఉంటుంది. నా పిల్లలు ఆర్టిస్టులు అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ వాళ్లు ఏం అవుతారో చూద్దాం. అసలు ‘కన్నప్ప’ ఈ రేంజ్ పాజిటివిటీతో వస్తుందని ఒకప్పుడు ఎవ్వరూ ఊహించలేదు. కర్ణాటకలో తెల్లవారు ఝామున రెండు గంటలకు ప్లాన్ చేశారు. కేరళలో పెద్ద ఎత్తున సినిమాను విడుదల చేస్తున్నారు. నా సినిమా పది వారాల వరకు ఓటీటీలో రాదు. నా మీద రిలీజ్ గురించి ఎటువంటి ఒత్తిడి లేదు. నేను అందరినీ గౌరవిస్తాను. ఏ కమ్యూనిటీని కించపర్చాలని కూడా అనుకోను. ఈ సినిమాలో ఎవ్వరినీ ఎక్కడా కూడా అగౌరవపర్చలేదు అన్నారు విష్ణు.

58

కన్నప్ప కథ కల్పితం కాదు, అంత బడ్జెట్ ఎందుకు పెట్టారంటే?

ఇక దేవుడు, భక్తుడికి మధ్యలో ఎవ్వరూ ఉండాల్సిన పని లేదు, మూఢ నమ్మకాలు అవసరం లేదు అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశం. దేవుడి మీద మనసారా భక్తి ఉంటే చాలు అని చెప్పాలని అనుకున్నాం. ‘కన్నప్ప’ స్క్రిప్ట్ మీదున్న నమ్మకంతోనే ఇంత బడ్జెట్ పెట్టి, రిస్క్ చేసేందుందుకు ముందుకు వచ్చాం. ఈ సినిమాలో మోహన్‌లాల్ గారి పాత్ర చాలా సర్ ప్రైజింగ్‌గా, షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది. ‘కన్నప్ప’ కథ కల్పితం కాదు. కన్నప్ప ఉన్నారు.. ఇప్పటికీ ఆయన్ను ఆరాధిస్తుంటారు. మళ్లీ చెబుతున్నాను ‘కన్నప్ప’ కల్పితం కాదు, చరిత్ర.. మన చరిత్ర. మన మధ్యలో జీవించినవాడు’ అని అన్నారు.

68

కన్నప్ప కోసం కష్టపడ్డాం, ఫలితం కోసం ఎదురుచూస్తున్నాం

డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘నేను ఇంత వరకు కన్నప్ప గురించి ఎంతో చెప్పాను. మోహన్ బాబు గారు, విష్ణు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. మేం కన్నప్ప చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించాం. ఇక ఇప్పుడు మేం మా పనికి తగ్గ ప్రతిఫలం కోసం ఎదురుచూస్తున్నాం. మేం ఆడియెన్స్ ఇచ్చే ఫలితం కోసం వెయిట్ చేస్తున్నాం. కన్నప్ప గురించి ఇప్పటి తరానికి ఎక్కువగా తెలియదు. భక్తి, దేవుడు అనే వాటి మీద నమ్మకం లేని వ్యక్తి.. చివరకు గొప్ప శివ భక్తుడిలా ఎలా మారాడు? అన్నది ప్రపంచానికి తెలియజేయాలని ఈ ‘కన్నప్ప’ సినిమాను తీశాం. ఇందులో ప్రతీ పాత్రకు అందరూ ప్రాణం పెట్టి నటించారు. పూర్తి నిర్మలమైన మనసుతో సినిమాను చూడండి. మీరిచ్చే తీర్పుని గౌరవిస్తాను’ అని దర్శకుడు అన్నారు.

78

ఒట్టేసి చెపుతున్నా ఇలాంటి సినిమాలు అరుదు

భూమ్మీద అతి సుందరమైన ప్రదేశంలో(న్యూజిలాండ్) షూటింగ్ చేశాం. ప్రస్తుతం సినిమా మీద పూర్తిగా పాజిటివిటీ ఏర్పడింది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి సినిమాలు చేయడం, నిర్మించడం అంత ఈజీ కాదు. నేను కన్నప్ప చిత్రాన్ని ఆల్రెడీ చూశాను. ఒట్టేసి చెబుతున్నా సినిమా అద్భుతంగా ఉంటుంది’ అని శివబాలాజీ అన్నారు.

88

కన్నప్ప’ చిత్రం అద్భుతంగా వచ్చింది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లోని చివరి గంట గొప్పగా వచ్చింది. క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది’ అని కెమెరామెన్ షెల్డన్ చౌ అన్నారు. మా ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న రాబోతోంది. మన తెలుగు వాళ్లకు దాదాపు మళ్లీ 50 ఏళ్ల తరువాత కన్నప్ప చిత్రాన్ని ఈ తరానికి తగ్గట్టుగా విష్ణు అందిస్తున్నారు. విజువల్ వండర్‌గా, గ్రాండియర్‌గా ఈ మూవీని నిర్మించారు. ప్రస్తుతం ఉన్న తరమంతా కూడా కన్నప్ప చిత్రాన్ని చూడాలి’ అని బిగ్ బాస ఫేమ్ కౌశల్ మందా అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories