IAS అవ్వబోయి సినిమాల్లో సెటిల్ అయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Jun 26, 2025, 07:27 PM IST

సాధారణ ప్రజలే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీలు కూడా జీవితంలో ఎన్నో ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగుతుంటారు. లైఫ్ లో వాళ్లు పెట్టుకున్న లక్ష్యాలు వేరు, సాధించింది వేరు. IAS అవ్వాలనుకుని ఇండస్ట్రీలో స్టార్ గా మారిన హీరోయిన్ ఎవరో తెలుసా?

PREV
17

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా దూసుకుపోతున్నవారిలో చాలామంది అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చినవారే. హీరోలు, హీరోయిన్లు అవ్వకపోతే ఏ డాక్టరో, కలెక్టరో అవ్వాలనుకున్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తిత్వం కలిగినవారిలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఒకరు. చదువులో చురుకైన విద్యార్థిగా ఉన్న ఆమె.. హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు. బాగా చదువుకుని ఐఏఎస్ అవ్వాలని కలలు కన్నది రాశి. కాని ఆమె ప్రయాణం, అంచానాలకు మించి ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు టర్నింగ్ తీసుకుంది.

27

రాశీ ఖన్నా ఏం చదువుకుంది.

1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించిన రాశీ ఖన్నా, చదువులో టాపర్, స్కూల్ చదువులో మొదటి నుంచే ప్రతిభను చూపించింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ కాలేజీలో ఇంగ్లిష్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. స్కూల్లో టాపర్‌గా నిలిచిన ఆమెకు ఐఏఎస్ అధికారిగా సేవ చేయాలన్న ఆశ ఉండేది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆమె కొన్ని అడ్వర్టైజ్‌మెంట్‌లకు కాపీరైటర్‌గా కూడా పనిచేసింది.

37

హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం

అనుకోకుండా వచ్చిన మోడలింగ్ అవకాశాలు వదలకుండా పట్టుకుంది రాశీ ఖన్నా. మోడలింగ్ ద్వారా ఆమె కెరీర్ మలుపు తిరిగింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ ప్రారంభించిన రాశి, ఆ ప్రపంచంలో తన ప్రతిభను చూపించి సినిమాల వైపు మళ్లింది. ఊహలు గుసగుసలాడే (2014) సినిమాతో తెలుగు తెరపై రాశీ ఖన్నా అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీ హిట్ కావడంతో ఆమెకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చింది. వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి.

47

రాశీ ఖన్నా సినిమాల లిస్ట్

తెలుగులో వరుస సినిమాలు చేసింది రాశీ ఖన్నా. టాలీవుడ్ లో సుఫ్రీం, తొలి ప్రేమ, వెంకీ మామ, థాంక్యూ, రాజా ది గ్రేట్, హైపర్, సర్దార్ లాంటి సినిమాల్లో నటించిన రాశీ.. ఆతరువాత పక్క ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది. తమిళ, హిందీ సినిమాల్లో కూడా రాశీ ఖన్నా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆమె కెరీర్‌లో హిట్ లిస్టుకు పక్కన, ఫ్లాప్‌ల జాబితా కూడా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ, విమెన్ సెంట్రిక్ పాత్రలు ఎంచుకుంటూ బిజీగా నటిస్తూ వస్తోంది.

57

రాశీ ఖన్నా రెమ్యునరేషన్, ఆస్తులు

ప్రస్తుతం రాశీ ఖన్నా ఒక్కో సినిమాకు రూ.1 కోటి రూపాయల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె నికర ఆస్తి సుమారు 66 కోట్లు ఉండవచ్చని అంచనా. మోడలింగ్ ద్వారా మొదలైన ఈ ప్రయాణం, ఇప్పుడు హీరోయిన్ గా కోటి రూపాయల పారితోషికం అందుకునే స్టార్ స్థాయికి చేరింది.

67

ఫిట్ నెస్ విషయంలో రాశీ ఖన్నా జాగ్రత్తలు

కెరీర్ ప్రారంభంలో బొద్దుగా కనిపించిన రాశీ ఖన్నా, ఇప్పుడు స్లిమ్ గా మారిపోయింది. కెరీర్ ను కాపాడుకోవడం కోసం ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తూ.. జిమ్‌లో కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తోంది. స్లిమ్ ఫిగర్‌తో పాటు ఫిట్‌నెస్ మీద దృష్టి పెడుతూ తన ప్రొఫెషనల్ లుక్‌ను మెరుగుపరుచుకుంటోంది. అయితే టాలీవుడ్ లో మాత్రం రాశికి పెద్దగా అవకాశాలు రావడంలేదు. బాలీవుడ్ లో కూడా రాశీకి అవకాశాలు రావడంలేదు.

77

సోషల్ మీడియాలో రాశీ ఖన్నా పాపులారిటీ

రాశీ ఖన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ను భారీగా సాధిస్తోంది. ఇప్పటికే రాశీకి ఇన్ స్టాలో సంపాదన చాలా ఉంది. తన బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునేందుకు ఆమె స్టయిలిష్, గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తోంది. అంతే కాదు ఇన్ స్టాలో ప్రమోషన్స్, ఫోటో స్టోరీస్ పెట్టినందుకు కూడా లక్షల్లో సంపాదిస్తోంది రాశి.

Read more Photos on
click me!

Recommended Stories