విజయ్ దళపతి తన చివరి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?

Published : Jun 26, 2025, 06:06 PM IST

రాజకీయ రంగ ప్రవేశం చేసిన సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలు వదిలేస్తున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం తన చివరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇంతకీ ఈ సినిమాకు ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత..?

PREV
16

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా తమిళ సినిమాలో టాప్ స్టార్‌ దళపతి విజయ్. ప్రస్తుతం విజయ్ తన 69వ సినిమా జన నాయగన్’ షూటింగులో బిజీగా ఉన్నారు. విజయ్ తన చివరి సినిమాను హెచ్. వినోద్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతుండగా, ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గా కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. విజయ్ 51వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకు అభిమానుల నుండి భారీగా స్పందన లభించింది.

26

ఈ గ్లింప్స్‌లో విజయ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపించగా, ఈగెటప్ లో దళపతిని చూసి సినిమా మీద హైప్ మరింత పెరిగింది. విజయ్ బీస్ట్ సినిమా తరువాత మరోసారి పూజా హెగ్డేకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు విజయ్ దళపతి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ప్రియమణి, నరేన్, మమితా బైజు, వరలక్ష్మి వంటి నటులు కూడా సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.

36

ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తైన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా, 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది.ఈ నేపథ్యంలో ‘జన నాయగన్’ విజయ్ చివరి సినిమా కావడంతో రాజకీయంగా విజయ్ జోరు పెరిగింది.

 వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పార్టీ పనులు స్పీడప్ చేశాడు విజయ్. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్టు సమాచారం. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో టైమ్ కేటాయించడం కోసమే విజయ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

46

ఇదిలా ఉంటే, ‘జన నాయగన్’ సినిమా కోసం విజయ్ భారీ పారితోషికం తీసుకుంటున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, విజయ్ ఈ సినిమా కోసం దాదాపు 275 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

ఈ మొత్తాన్ని కేవలం నటనకు సంబంధించి పారితోషికంగా మాత్రమే తీసుకుంటున్నాడని, సినిమా లాభాల్లో వాటా తీసుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి మాత్రం ఎవరు అధికారికంగా స్పందించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ రూమర్ గట్టిగా వినిపిస్తుంది.

56

విజయ్ పారితోషికం విషయమై ఇది నిజమైతే, ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో విజయ్ కూడా చేరతారు. ఇప్పటికే తమిళం నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, లాంటి సీనియర్స్ 100 కోట్లకు పైగా వసూలు చేస్తుండగా.. విజయ్, మాత్రం 200 కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో విజయ్ మార్కెట్ ఉన్నందున, ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడరనే చెప్పాలి. ఈ సినిమా దర్శకుడు హెచ్. వినోద్ గతంలో తూపాకి, ఖాకీ, ది వాల్యూ ఆఫ్ ట్రూత్ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. 

పోలీస్ డ్రామామూవీస్ ను రూపొందించడంతో వినోద్ మార్క్ సెపరేట్ గా ఉంటుంది. జన నాయగన్’ కూడా పోలీస్ నేపథ్యం గల యాక్షన్ డ్రామా కావడంతో, ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ జననాయగన్ సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

66

విజయ్ అభిమానులకు ఇది డబుల్ ఎగ్జైట్‌మెంట్‌ను కలిగించే విషయంగా మారింది. ఒకవైపు ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం కావడం, మరోవైపు తాను నటిస్తున్న చివరి సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతుండటంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అంతేకాదు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ‘జన నాయగన్’ విజయ్ కెరీర్‌లో ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. అభిమానులు మాత్రం ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూడాలా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories