బాలయ్య షోలో `వీరసింహారెడ్డి` టీమ్‌ హల్‌చల్‌.. ఈ సంక్రాంతికి ఫ్యాన్స్ కి డబుల్‌ బోనాంజా..

Published : Jan 10, 2023, 11:50 AM IST

బాలయ్య హోస్ట్ గా చేస్తున్న `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే2`లో `వీరసింహారెడ్డి` టీమ్‌ సందడి చేసింది. ఈ సంక్రాంతికి బాలయ్య అభిమానులకు డబుల్‌ బోనాంజా ఇవ్వబోతున్నారు. రెండు పండగలు తీసుకురాబోతున్నారు.   

PREV
15
బాలయ్య షోలో `వీరసింహారెడ్డి` టీమ్‌ హల్‌చల్‌.. ఈ సంక్రాంతికి ఫ్యాన్స్ కి డబుల్‌ బోనాంజా..

బాలయ్య అడ్డాగా పిలుచుకునే షో `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే 2`. `ఆహా`లో ప్రసారమయ్యే ఈ సెలబ్రిటీ టాక్‌ షోకి విశేషం ఆదరణ లభిస్తుంది. ఇండియాలోనే టాప్‌ సెలబ్రిటీ షోగా నిలిచింది. బిగ్గెస్ట్ స్టార్స్ ఇందులో సందడి చేస్తున్న నేపథ్యంలో ఇది నెంబర్‌ వన్‌ షోగా నిలుస్తుంది. బాలయ్య మాటల్లో చెప్పాలంటే అన్ని టాక్‌ షోలకు అమ్మ మొగుడై కూర్చుంది. 

25

ఇప్పటి వరకు బిగ్గెస్ట్ స్టార్స్ ఇందులో సందడి చేస్తూ వస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. అయితే అందులో సడెన్‌ సర్‌ప్రైజింగ్‌గా `వీరసింహారెడ్డి` టీమ్‌ సందడి చేయబోతుంది. వీరిపై ఇప్పటికే షూటింగ్‌ పూర్తయ్యింది. తాజాగా ఈ విషయాన్ని `ఆహా` వెల్లడించింది. సంక్రాంతి కానుకగా వీరి ఎపిసోడ్‌ ప్రసారం కానుందని సమాచారం. 
 

35

బాలకృష్ణ హీరోగా నటించిన `వీరసింహారెడ్డి` సినిమాలో శృతి హాసన్‌ కథానాయికగా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్‌, రోసీ, కీలక పాత్రలు పోషించారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. ఈ నలుగురు బాలయ్య షోలో సందడి చేశారు. శృతి హాసన్‌ తప్ప,  మిగిలిన వాళ్లు దర్శకుడు గోపీచంద్‌, రోసి, వరలక్ష్మి, నిర్మాత రవిశంకర్‌, నవీన్‌ ఇందులో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలను ఆహా విడుదల చేయగా, అవి వైరల్‌ అవుతున్నాయి. శృతి హాసన్‌ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఆమె షోకి రాలేదని సమాచారం. 
 

45

బాలయ్య హోస్ట్ గా చేస్తున్న షోలో తన సినిమా టీమ్‌ సందడి చేయడం, వారితో సరదాగా చర్చ ఇందులో హైలైట్‌గా నిలవనుంది. మొదటి సీజన్‌ సమయంలో `అఖండ` టీమ్‌ సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి బాలయ్య ఫ్యాన్స్ కి డబుల్‌ బోనాంజా ఇవ్వబోతున్నారు బాలయ్య. ఓ వైపు సినిమా, మరోవైపు ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ కానుంది. 

55

`వీరసింహారెడ్డి` సినిమా సంక్రాంతి కానుకుగా ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమాకి భారీ బుకింగ్స్ వస్తున్నాయి. ఓవర్సీస్‌లో దుమ్మురేపుతుంది. చిరంజీవిని దాటేసింది. సంక్రాంతికి బాలయ్య రచ్చ చేయబోతున్నారని చెప్పొచ్చు. మరోవైపు సంక్రాంతి కానుకగానే తమ `వీరసింహారెడ్డి` టీమ్‌ పాల్గొన్న ఎపిసోడ్‌ ఈ శుక్రవారం టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఓ రకంగా ఇది బాలయ్య ఫ్యాన్స్ కి డబుల్‌ బోనాంజా అని చెప్పడంలో సందేహం లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories