ఇంకానయం పది బాహుబలి, పది అవతార్ లతో పుష్ప సమానం అనలేదు... నెటిజెన్స్ కి బలైన బుచ్చిబాబు!

First Published Jun 18, 2021, 8:11 AM IST

మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మనం మాట్లాడే మాటకు సరైన అర్థం, స్పష్టత ఉండాలి. అదే సమయంలో ఎవరినీ కించపరిచేవిగా ఉండకూడదు. అయితే ఒక్కోసారి ఓవర్ ఎక్సయిట్మెంట్ మాట తూలేలా చేస్తుంది. 
 

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు అతన్ని తీవ్ర విమర్శలపాలు చేశాయి. ఆయన పుష్ప మూవీని పొగిడే క్రమంలో కెజిఎఫ్ చిత్రాన్ని తక్కువ చేసి మాట్లాడారు. దీనితో కెజిఎఫ్ అభిమానులు, నెటిజెన్స్ బుచ్చిబాబును ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.
undefined
ఓ కార్యక్రమంలో పాల్గొన్న బుచ్చిబాబు తన గురువుగారైన సుకుమార్ తీసిన పుష్ప సినిమాను ఆకాశానికి ఎత్తాడు. పుష్ప మూవీ పార్ట్ వన్ నేను చూశాను. పుష్ప ఓ విజువల్ వండర్ లా ఉంటుంది. హీరో ఎలివేషన్ కూడా అద్భుతం అన్నాడు.
undefined
ఇదే క్రమంలో ఓ పది కెజిఎఫ్ లు కలిపితే పుష్ప మూవీ అని కూడా అనేశాడు. ఈ పోలిక నెటిజెన్స్ కి నచ్చలేదు. పుష్ప సినిమాను కావాలంటే ఎంతైనా పొగుడుకో.. కానీ కెజిఎఫ్ లాంటి ఎపిక్ వండర్ తో పోల్చుతావా అంటూ బుచ్చిబాబుపై నెటిజెన్స్ ఫైర్ అయ్యారు. ఇక కామెంట్స్ రూపంలో బుచ్చిబాబును ట్రోల్ చేస్తున్నారు.
undefined
KGF ని నువ్వు కాదు కదా నీ అయ్య వచ్చినా క్రాస్ చేయలేడు అని ఓ నెటిజెన్ కామెంట్ చేయగా అరే చెప్పడానికి ఐనా వుండాలి.....ఎవరి సినిమా వాళ్ళదే....ఎందుకు అనవసరంగా జనాలలో లేని పోని ఆలోచనలు పెంచి తిట్లు తింటారు....10 కేజిఎఫ్ లు 100 బాహుబలిలు....అవసరమా అంటూ మరొక నెటిజెన్ కామెంట్ చేశాడు.
undefined
నీ ఉప్పెనలా గుత్తి కోసే సినిమా కాదు కేజీఎఫ్ అంటే.. నీకు ఇంతకంటే మంచి ఆలోచన రాదులే.. అని ఒకరు కామెంట్ చేశారు.  బుచ్చిబాబు మీ సినిమా మంచిది అని చెప్పు అంతేగాని మంచి సినిమా అయినా కేజిఎఫ్ సరిపోదు అని చెప్పడానికి నువ్వు ఎవడివిరా ఇప్పటి నుంచే భజన మొదలు పెట్టావా.. అంటూ మరొకరు ఫైర్ అయ్యారు.
undefined
ఏమి రా బుచ్చి గా మరాటీ (సైరాట్) సినిమా ని కాపీ కొట్టి మార్పులు చేర్పులు చేసి ఉప్పెన అని టైటిల్ పెట్టి తీసినవ్ నువు కేజీఏఫ్ మూవీ నే డిస్సపాయింట్ చేస్తావా? ట్రైలర్ కూడా రిలీజ్ కాని సినీమాని.. కేజీఎఫ్ కంటే పదింతలు ఎక్కువ అంటావా మూసుకో బుచ్చి.  ఇంకా నయం 10 బాహుబలి,,10 అవతార్ కలిపిన పుష్ప మూవీకి సరిపోవు అనలా ఎర్రి,,, నువ్వు నీ భజన.. అంటూ కామెంట్ చేశారు.
undefined
ఇక బుచ్చిబాబుపై నెటిజెన్స్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనవసరంగా లేని వివాదాన్ని గెలుక్కోని బుచ్చిబాబు అబాసు పాలయ్యాడు. ఇకపైన అయినా ఈ యువ దర్శకుడు ఇలాంటి కామెంట్స్ విషయంలో జాగ్రత్తపడితే బెటర్..
undefined
click me!