రామ్ చరణ్ ను కాదని అల్లు అర్జున్ కు హిట్ సినిమా కథను ఇచ్చిన చిరంజీవి.. కారణం ఇదే..?

First Published | Jul 20, 2024, 12:58 PM IST

మెగా హీరోలకు ఎంత ఇమేజ్ ఉందో అందరికి తెలిసిందే.. అయితే అటు అల్లు అర్జున్.. ఇటు రామ్ చరణ్.. మధ్యలో చిరంజీవి మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితినే ఫేస్ చేస్తున్నారు. కాని ఒక సందర్భంలో చరణ్ ను కాదని.. హిట్ సినిమా కథను బన్నీకే ఇచ్చాడట మెగాస్టార్.

Mega heroes

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా ఇమేజ్ ఉన్న ఈముగ్గరు హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే.. అయితే ప్రస్తుతం చరణ్, బన్నీలకు పడటంలేదని.. కోల్డ్ వార్ నడుస్తుందని మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ దూరంగా ఉంటోందన్న టాక్ గట్టిగా నడుస్తోంది.  కాని ఈ విషయంలో మెగా హీరోలు మాత్రం బయటపడటంలేదు. 
 

All So Read; భార్యను వదిలేద్దామనుకున్నా పూరీ జగన్నాథ్.. లావణ్య గురించి ఆ నిజం తెలియడంతో షాక్ అయ్యాడట.

అటు అల్లు అర్జున్.. ఇటు రామ్ చరణ్.. ఇద్దరు స్టార్ హీరోలే.. ఇద్దరికి భారీగా ఫ్యాన్ బేస్ ఉంది.  అల్లు అర్జున్ మెగా ఇమేజ్ తో ఇండస్ట్రీకి వచ్చినా.. తన సొంత మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. అల్లు బ్రాండ్ ను ప్రమోట్ చేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్నాుడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు., 
 

All So Read; ఎక్కువ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు సాధించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..?


అయితే ఈ ఇద్దరు హీరోలలో ఎవరూ తీసిపోరు.. ఎవరి స్టార్ డమ్ వారిది.. కలిసినప్పుడు ప్రేమగా మాట్లాడుకుంటారు.. కాని లోపల మాత్రం ఏదో జరుగుతంది అనేది అందరి అనుమానం అయితే ఈక్రమంలో ఈ ఇద్దరు స్టార్లకు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గాసిప్ గా తిరుగుతున్న ఈ  మ్యాటర్ లో నిజం ఎంతో తెలియదు కాని.. ఆడియన్స్ మాత్రం చెవులు కొరికేసుకుంటున్నారు. 

All So Read; నాలుగో పెళ్లికి రెడీ అవుతున్న వనితా విజయ్ కుమార్..? మీడియాకు హింట్ ఇచ్చేసిందిగా...?

ఇంతకీ విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ ను కాదని.. సూపర్ హిట్ మూవీ కథను అల్లు అర్జున్ కు ఇచ్చాడట. వింటానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజమంటున్నారు సినీజనాలు.. నిజానిజాలు తరువాత సంగతి కాని.. రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ ముందుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బన్నీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా గంగోత్రి.  ఈసినిమా కథ ముందుగా రామ్ చరణ్ దగ్గరకు వెళ్లిందట. 

All So Read; నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో ఎన్ని కోట్ల విలువ చేస్తుందో తెలుసా..? వింటే షాక్ అవుతారు..?

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. 100రోజులు ఆడింది. ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈమూవీ.. అల్లు అర్జున్ ను హీరోగా నిలబెట్టింది. ఫస్ట్ మూవీనే హిట్ కొట్టడంతో ఇండస్ట్రీలో తిరుగు లేని హీరోగా మారిపోయాడు బన్నీ. 

All So Read; అమితాబచ్చన్ తో లిప్ లాక్ సీన్.. భయంతో రెండు సార్లు బ్రెష్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

అయితే ఈసినిమా స్టోరీని రామ్ చరణ్ ఎంట్రీ కోసం చెప్పారట దర్శకుడు. అయితే రామ్ చరణ్ అప్పటికే సినిమాల్లోకి రావడానికి రెడీగా లేడు.. అప్పుడే ట్రైయినింగ్ మొదలు పెట్టాడట. దాంతో చిరంజీవి ఈ కథను అల్లు అర్జున్ ఎంట్రీకి పంపించాడట. అప్పటికే  బన్నీ చిన్న చిన్న పాత్రలు చేసి ఉండట..డాన్స్ తో పాటు... నటన పరంగా కూడా రెడీగా ఉండటంతో.. బన్నీ ప్రొసీడ్ అయ్యాడట. 
 

ఇలా చిరంజీవి చరణ్ ను కూడా కాదని గంగోత్రి సినిమాను బన్నీ కోసం పంపించాడట. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. ఇండస్ట్రీలో మాత్రం ఈ గాసిప్ గట్టిగా తిరిగింది. ఫిల్మ్ సర్కిల్ లో కూడా  ఈ విషయంపై గుసగుసలు వినిపించాయి. ఏది ఏమైనా ఈ ఇద్దరు హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. 

Ram Charan - Allu Arjun

ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తే.. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ వరకూ వెళ్ళివచ్చాడు. ఇక బన్నీ పుస్ప2తో అంతకు మించి నిరూపించాలని తెగ కష్టపడుతున్నాడు. అటు రామ్ చరణ్ శంకర్ తో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు. ఈమూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈసినిమా తరువాత బుచ్చిబాబుతో మరో భారి సినిమాకు రెడీ అవుతున్నారు. 

Latest Videos

click me!