చిరంజీవితో నయన్, వెంకీ, నాగ్ దీపావళి సెలబ్రేషన్స్.. చిచ్చు బుడ్డీల్లా మెరిసిన హీరోయిన్లు, వైరల్ ఫోటోస్

Published : Oct 20, 2025, 07:18 PM IST

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నయనతార కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. అదే విధంగా రష్మిక, రాశి ఖన్నా, శ్రీలీల, మృణాల్ ఠాకూర్ లాంటి టాలీవుడ్ హీరోయిన్లు షేర్ చేసిన దీపావళి ఫోటోస్ ని ఈ కథనంలో చూద్దాం. 

PREV
113
సెలబ్రిటీల దీపావళి సంబరాలు

టాలీవుడ్ లో దీపావళి సెలబ్రేషన్ అంబరాన్ని అంటుతున్నాయి. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా టాప్ స్టార్లు దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రష్మిక, శ్రీలీల, రాశీ ఖన్నా లాంటి హీరోయిన్లు తమ గ్లామర్ తో చిచ్చు బుడ్డీల్లా వెలుగులు విరజిమ్ముతున్నారు. సెలెబ్రిటీల దీపావళి సంబరాలకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు చూద్దాం. 

213
నయన్, నాగ్, వెంకీ మెగా దీపావళి సెలబ్రేషన్స్ 

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో టాలీవుడ్ అగ్ర హీరోలు వెంకటేష్, నాగార్జున వారి సతీమణులతో కలసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ మెగా దివాళి సెలెబ్రేషన్స్ లో నయనతార కూడా జాయిన్ అయింది. చిరంజీవి, నయనతార ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్రంలో నటిస్తున్నారు. 

313
రష్మికకి ఈ దీపావళి చాలా స్పెషల్ 

ఇటీవలే రష్మిక, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరిగింది. కాబట్టి రష్మికకి ఈ దీపావళి చాలా స్పెషల్ అనే చెప్పాలి. దీపావళి సంబరాల్లో భాగంగా రష్మిక వైట్ చుడిదార్ ధరించి, అందంగా ఆభరణాలతో మెరిసిపోతోంది. ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

413
అనసూయ భరద్వాజ్ 

అనసూయ దీపావళిని తన కుటుంబ సభ్యులతో కలసి జరుపుకుంది. ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనసూయ సింపుల్ లుక్ లో మెరిసిపోతోంది. 

513
శ్రీలీల

యంగ్ బ్యూటీ శ్రీలీల దీపావళి సందర్భంగా బ్లూ డ్రెస్ లో మెరిసింది. అందమైన జడ అల్లికతో శ్రీలీల నెటిజన్లని ఆకర్షిస్తోంది. అభిమానులకు ఆమె దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.  

613
నభా నటేష్ 

ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ అంటే సోషల్ మీడియాలో ఆమె చేసే గ్లామర్ షో అభిమానులకు గుర్తుకు వస్తుంది. దీపావళి సందర్భంగా నభా ఎంతో అందంగా చీరకట్టులో మెరిసింది. తన తల్లి లాగా చీర కట్టుకుని మురిసిపోయింది.

713
హెబ్బా పటేల్ 

యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ హెబ్బా పటేల్. హెబ్బా దీపావళి సందర్భంగా సిల్వర్ కలర్ లెహంగాలో మెరిసింది. ఎంతో అందంగా ఉన్న హెబ్బా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

813
ఆషిక రంగనాథ్ 

యంగ్ హీరోయిన్ ఆషిక రంగనాథ్ ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. దీపావళి సందర్భంగా ఆషిక మెరూన్ కలర్ లెహంగాలో మెస్మరైజింగ్ ఫోజులు ఇచ్చింది. 

913
పూజా హెగ్డే 

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే దీపావళి సెలెబ్రేషన్స్ లో భాగంగా లైట్ పింక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. చిరునవ్వులు చిందిస్తున్న పూజా హెగ్డే ఫోటోలు యువతని ఆకట్టుకుంటున్నాయి. 

1013
మృణాల్ ఠాకూర్ 

దీపావళికి గ్లామర్ మోడ్ యాక్టివేటెడ్ అంటూ సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బ్లూ శారీలో మెరుపులు మెరిపించింది. చీరకట్టులో ఆమె అందం, హెయిర్ స్టైల్ యువతని మెప్పిస్తున్నాయి. 

1113
రాశి ఖన్నా 

రాశి ఖన్నా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తోంది. దీపావళి సంబరాల్లో భాగంగా రాశి ఖన్నా గ్లామర్ ఒలకబోస్తూ అందమైన డ్రెస్ లో మెరిసింది.  

1213
ప్రగ్యా జైస్వాల్ 

అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అందమైన డిజైనర్ చీరలో మెరిసిపోతూ ఫోజులు ఇచ్చింది. అభిమానులకు ఆమె దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.

1313
అల్లు అర్జున్ ఇంట్లో దీపావళి సంబరాలు 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలసి ఇంట్లో దీపావళి పండుగని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆ దృశ్యాలని అల్లు స్నేహ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories