Dude Collections: ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన `డ్యూడ్` మూవీ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. తెలుగులో యావరేజ్‌గానే ఉన్నా, కోలీవుడ్ లో మాత్రం దుమ్ములేపుతుంది.
'కోమాలి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్, చాలా కాలం తర్వాత దర్శకత్వం వహించి నటించిన సినిమా 'లవ్ టుడే'. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. దీని తర్వాత ప్రదీప్ `డ్రాగన్` మూవీతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. రూ.150కోట్లు వసూలు చేసింది.. `డ్రాగన్` ప్రదీప్ రేంజే మారిపోయింది. ఈ మూవీతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు చేయడం, యూత్‌కి, నేటి ట్రెండ్ కి దగ్గట్టుగా ఆయన సినిమాలు, ఆయన రోల్స్ ఉండటంతో ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. తెలుగులోనూ మంచి ఇమేజ్ ఏర్పడింది.
24
`డ్యూడ్`తో ఆకట్టుకుంటోన్న ప్రదీప్ రంగనాథన్
తాజాగా `డ్యూడ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు ప్రదీప్. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శరత్‌కుమార్, రోహిణి, మమితా బైజు, ప్రదీప్ రంగనాథన్, నేహా శెట్టి వంటి తారలు నటించారు. దీపావళి పండుగని పురస్కరించుకుని ఈ చిత్రం శుక్రవారం(అక్టోబర్ 17)న విడుదలైంది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఫస్టాఫ్ కామెడీగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నా, సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదనే టాక్ ఉంది. క్లైమాక్స్ మెప్పించింది. దీంతో మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ టాక్‌తో సంబంధం లేకుండా సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి.
34
టాక్‌తో సంబంధం లేకుండా రచ్చ చేస్తోన్న `డ్యూడ్`
ప్రేమించిన వ్యక్తితో తిరిగి, అతని వల్ల గర్భవతి అయి, ఆ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకుని, చివరకు ప్రియుడితో కలవడం అనేది ఈ కాలానికి ఓకే అయినా, ఇది పాత కథే. ఇలాంటి సినిమాలు మన తమిళంలో చాలా వచ్చాయి. కాన్సెప్ట్ పాతదే అయినా, దర్శకుడు కాలానికి తగ్గట్టుగా తీసి హిట్ కొట్టాడు. దీంతో తెలుగులో దీనికి మిశ్రమ స్పందన లభిస్తున్నా, కోలీవుడ్‌లో మాత్రం మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
ఈ మూవీ రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ నేపథ్యంలో, సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం, సినిమా మొదటి రోజు రూ.9.75 కోట్లు, రెండో రోజు తమిళంలో రూ.7.4 కోట్లు, తెలుగులో రూ.2.9 కోట్లు కలిపి మొత్తం రూ.10.3 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు ఈ సినిమా రూ.10.50 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో భారతదేశవ్యాప్తంగా మొత్తం రూ.30.35 కోట్లు వసూలు చేసినట్లు సాక్నిల్క్ రిపోర్ట్ పేర్కొంది. కానీ ఈ మూవీ మూడు రోజుల్లో సుమారు రూ.45కోట్లు ఇండియాలో వసూలు చేసిందని, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.60కోట్లకుపైగా వసూళు చేసినట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. సోమవారం కూడా సినిమాకి భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ వసూళ్లని చూస్తుంటే స్టార్ హీరోలకు కూడా మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పొచ్చు.