బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చాక మరింత ఆసక్తికరంగా మారింది. దివ్వల మాధురి, అయేషా, నిఖిల్, సాయి లాంటి వారంతా వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. వీరికంటే ముందుగా దివ్య బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డుగా అడుగుపెట్టింది. ఆదివారం రోజు జరిగిన దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ భరణిని ఎలిమినేట్ చేశారు. భరణి ఎలిమినేషన్ ని ఎవరూ ఊహించలేదు.