@Love Movie Review
కథ:
ఎమ్మెల్యే శర్మ రాజకీయంగా హోదా, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. అతని ఒక్కగానొక్క కూతురు విందు ఒక గిరిజన కుర్రాడు రామ్ ప్రేమలో పడిందని తెలిసి ఆవేశానికి గురవుతాడు. కూతురికి నచ్చజెప్పినా వినదని తెలిసి... అటు నుండి నరుకొద్దామని రామ్ పుట్టి పెరిగిన గూడెంకి బయలుదేరుతాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శర్మకు ఒక పెద్దాయన తారసపడతారు. అతడు చెప్పిన ప్రేమ కథ విని ఎమ్మెల్యే శర్మ దిగ్బ్రాంతికి గురవుతాడు. పెద్దాయన ఎమ్మెల్యే శర్మకు చెప్పిన ప్రేమ కథ ఎవరిది? ఆ కథ విన్నాక ఎమ్మెల్యే శర్మ ఏం చేశాడు? రామ్, విందు ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ...
@Love Movie Review
సినిమా ప్రధాన భాగం అందమైన అడవుల్లో సాగుతుంది. @లవ్ మూవీ చూస్తున్న ప్రేక్షకులకు ప్రకృతి వనాలకు టూర్ కి వెళ్లిన భావన కలుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ తరహా స్వచ్ఛమైన ప్రేమకథలు రావడం లేదు. దర్శకుడు నారాయణ ఈ తరం ప్రేక్షకులకు ఒక న్యూ లవ్ స్టోరీ పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. ప్రేమకథలో సంఘర్షణ, సెన్సిటివ్ ఎమోషన్స్ చక్కగా పండాయి. రెండు భిన్న కాలాల్లో సాగే లవ్ స్టోరీస్ ప్రేక్షకుడికి చెప్పుకోదగ్గ స్థాయిలో అలరిస్తాయి. దర్శకుడు నారాయణ ఎక్కడా డైవర్ట్ కాకుండా అవసరం లేని కమర్షియల్ అంశాలు టచ్ చేయకుండా చెప్పాలనుకున్న పాయింట్ నిజాయితీగా చెప్పాడు. ఆయన టేకింగ్ పర్లేదు.
@Love Movie Review
@లవ్ మూవీలో స్క్రీన్ ప్లే మెచ్చుకోవాల్సిన అంశం. ప్రేక్షకులకు ఉత్కంఠ రేపే లా నడిపిన విధానం బాగుంది. ముఖ్యంగా అడవి బిడ్డలైన చంద్ర, మహాలక్ష్మి ఎపిసోడ్స్ మంచి ప్రేమ కథ చూస్తున్న అనుభవాన్ని ఇస్తాయి. వీరి ప్రేమ కథ మెప్పిస్తుంది. వీరి ప్రేమ కథకు ముడిపడిన మోడరన్ లవ్ స్టోరీ రామ్ - విందు ఈ జెనరేషన్ ప్రేమికులను ప్రతిబింబిస్తుంది. పతాక సన్నివేశాల వరకు ఒక ఆసక్తి కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నటుడు రామరాజుతో పాటు లీడింగ్ రోల్స్ చేసిన అభి, సోనాక్షి మెప్పించారు.
@Love Movie Review
@ లవ్ మూవీలో పాత్రలు వాస్తవితకు దగ్గరగా ఉంటాయి. ప్రతి పాత్ర కథలో భాగమై ప్రాధాన్యత కలిగి ఉంటాయి.సామాజిక కోణాన్ని కూడా దర్శకుడు టచ్ చేశాడు. కులం, మతం, ధనిక, పేద తారతమ్యాలు వంటి సెన్సిటివ్ ఇష్యూస్ గురించి చర్చించాడు. ఇలాంటి సామాజిక అసమానతల వలన స్త్రీలు పడుతున్న ఇబ్బందులు చక్కగా వివరించారు. అలాగే ఆధునిక సమాజంలో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఏ స్థాయిలో వేళ్లూనుకొని, మూర్ఖులుగా మారుస్తుందో చెప్పిన విధానాన్ని మెచ్చుకోవాలి.
@Love Movie Review
మొత్తంగా @లవ్ మూవీతో ప్రేక్షకులు ఒక సున్నితమైన ఎమోషనల్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తాడు. బలమైన ప్రేమ బంధంతో ముడిపడిన ఇన్నోసెంట్ పాత్రలు దర్శనమిస్తాయి. దర్శకుడు కథకు అవసరం లేని కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా, చెప్పాలనుకున్న పాయింట్ నిజాయితీగా చెప్పాడు. రెండు తరాల ప్రేమకథలను ముడిపెట్టి వాటికి ముగించిన విధానం బాగుంది. ఓ తరహా ప్రేమ కథలు ఇష్టపడే వారికి @లవ్ నచ్చుతుంది. కమర్షియల్ అంశాలు కోరుకునేవారు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందక పోవచ్చు.
నటీనటులు:రామరాజు, అభి, సోనాక్షి...
దర్శకత్వం : శ్రీ నారాయణ
నిర్మాతలు మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ
సంగీతం: సన్నీ మాలిక్
స్క్రీన్ ప్లే: శ్రీ నారాయణ
పాటలు : లక్ష్మణ్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
కెమెరా మెన్ : మహి
Rating: 3/5