టెర్రరిస్ట్ గా సమంత సూపర్ సక్సెస్... ఎంట్రీతోనే బాలీవుడ్ మైండ్ బ్లాక్ చేసిన సూపర్ లేడీ!

First Published Jun 4, 2021, 8:41 PM IST

ఓటిటి సిరీస్లలో ఫ్యామిలీ మాన్ ఓ సెన్సేషన్. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. దర్శకత్వ ద్వయం రాజ్&డీకే అద్భుతం చేయగా, ఫ్యామిలీ మాన్ సిరీస్ వారికి మంచి ఫేమ్ తెచ్చి పెట్టింది. ఈ సిరీస్ కి కొనసాగింపుగా తెరకెక్కింది ఫ్యామిలీ మాన్ 2. 
 

టాలీవుడ్ క్వీన్ సమంత ఎంట్రీతో ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ హైప్ విపరీతంగా పెరిగిపోయింది. సమంత చేస్తున్న మొదటి వెబ్ సిరీస్ కావడంతో పాటు ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తుందన్న వార్త ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది.
undefined
అయితే ట్రైలర్ విడుదల తరువాత ఈ సిరీస్ పై తమిళ ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమంత రోల్ తమ మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందని విమర్శల దాడికి దిగారు. సమంతను టార్గెట్ చేసిన తమిళ నెటిజెన్స్ దారుణంగా ఆమెను ట్రోల్ చేయడం జరిగింది. సమంత కెరీర్ కే ప్రమాదంగా మారిన ఈ సిరీస్ వివాదాల మధ్య జూన్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ అంచనాలు అందుకున్నట్టే.
undefined
అండర్ కవర్ ఏజెంట్ గా ఎన్ ఐ ఏ లో పనిచేస్తున్న శ్రీకాంత్(మనోజ్) వ్యక్తిగత కారణాల చేత సంస్థ నుండి బయటికి వచ్చేస్తాడు. కుటుంబంతో సమయం గడపాలనే ఉద్దేశంతో ఓ ఐ టి కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అయినప్పటికీ శ్రీకాంత్ ఫ్యామిలీలో అనేక సమస్యలు ఉంటాయి. పేరెంట్స్ అంటే లెక్కచేయని కూతురు బాయ్ ఫ్రెండ్ తో ఎఫైర్ నడుపుతూ ఉంటుంది. కొడుకు మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. భార్య సుచి (ప్రియమణి)విడాకులు తీసుకోవాలని అనుకుంటారు.
undefined
విసిగించే బాస్, ఫ్యామిలీ ఇబ్బందులతో శ్రీకాంత్ లైఫ్ గందరగోళంగా ఉంటుంది. మరోవైపు రాజీ(సమంత) తమిళ రెబెల్స్ కి చెందిన సమంత ఓ టెర్రర్ ఆపరేషన్ కోసం ఇండియాలో దిగుతుంది. చెన్నైలో ఓ పరిశ్రమలో కూలీగా చేరుతుంది రాజీ. పరిశ్రమలో రాజీ లైంగిక వేధింపులకు గురి అవుతుంది. ఆ క్రమంలో ఆమె ఓ హత్య కూడా చేస్తుంది.
undefined
ఇండియాపై భారీ ఎటాక్ ప్లాన్ చేశారని మిత్రుడు ద్వారా తెలుసుకున్న శ్రీకాంత్ మరలా ఎన్ ఐ ఏ ఏజెంట్ గా మారతాడు. ఇండియాపై ఎటాక్ ప్లాన్ చేసిన గ్రూప్ ని లీడ్ చేస్తుంది సమంతనే అని తెలుసుకొని ఆమెను వెంటాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ కూతురిని టెర్రరిస్ కిడ్నాప్ చేస్తారు.
undefined
రాజీ టీమ్ ప్లాన్ చేసిన అటాక్ ని శ్రీకాంత్ అడ్డుకున్నాడా లేదా, టెర్రరిస్స్ కిడ్నాప్ అయిన కూతరుని ఎలా కాపాడుకున్నాడు. భార్య సుచితో ఏర్పడిన మనస్పర్థలు తొలగాయా లేదా అనేది చివరి ఎపిసోడ్ ఇచ్చిన ముగింపు.
undefined
దర్శకులు రాజ్ అండ్ డీకే మరో మారు తమ సత్తా చాటారు. అద్భుతమైన టేకింగ్, ఉన్నతమైన నిర్మాణ విలువలు, స్క్రీన్ ప్లే తో పాటు ప్రధాన పాత్రలు చేసిన మనోజ్, సమంత, ప్రియమణి, షరీబ్ హస్మి ఉత్తమ ప్రదర్శన సిరీస్ ని ఎంగేజింగ్ గా మార్చాయి. మొదటి సీజన్ చూడని వారు అది చూశాక సెకండ్ సీజన్ చూడడం వలన మరింతగా కనెక్ట్ అవుతారు.
undefined
ఎప్పటిలాగే నటుడు మనోజ్ పాత్రను సిట్యువేషన్ కామెడీ, ఎమోషన్స్, ఫ్రస్ట్రేషన్ తో చక్కగా మలిచారు. అయితే మొదటి సిరీస్ తో పోల్చుకుంటే హ్యూమర్ పాళ్ళు కొంచెం తగ్గాయి.
undefined
కఠిన పరిస్థితుల మధ్య పెరిగిన అమ్మాయిగా సుమంత అద్భుతం చేశారు. ఎమోషన్స్ అంటే తెలియని కరుడుగట్టిన టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటించిన తీరు ఆమె యాక్టింగ్ స్కిల్స్ కి మచ్చుతునక.
undefined
ఓ ఛాలెంజింగ్ రోల్ ని సమంత అలవోకగా చేశారనిపిచింది. ఫ్యామిలీ మాన్ 2 మనకు రాజీ అనే పాత్ర మాత్రమే కనిపిస్తుంది. సమంత అసలు గుర్తుకు రాదు. అమాయకురాలైన కూలీగా, డెంజరస్ లేడీ టెర్రరిస్ట్ గా సమంత రెండు భిన్న పాత్రలలో పరకాయ ప్రవేశం చేశారు.
undefined
బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఫిలిం క్రిటిక్స్ సమంత ప్రతిభను కొనియాడుతున్నారు. డెబ్యూ సిరీస్ తోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యారు సమంత. పాత్ర ఏదైనా సమంత చేస్తే దానికి కొత్తధనం వస్తుందని నిరూపించింది.
undefined
click me!