భర్త సైకో, రోజు టార్చర్... పాపను, వాడిని వదిలేస్తా: స్వాతినాయుడు

First Published Aug 1, 2020, 11:56 AM IST

తన దయనీయ పరిస్థితిని చెప్పుకోవడం ఇష్టం లేకున్నప్పటికీ.... తనకు చెప్పుకోకతప్పడంలేదంటూ ఒక వీడియోను షేర్ చేసింది స్వాతి నాయుడు. ఆ వీడియోలో తన బాధను వెళ్లబోసుకుంది ఈ శృంగార తార. 

స్వాతి నాయుడు- బుల్లి తెరపై యాంకర్ గా ప్రస్థానం మొదలుపెట్టి ఆ తరువాత బి గ్రేడ్ వీడియోలు, పోర్న్ స్టార్ గా మారింది. సెక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన డాక్టర్ సమరం షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ, శృంగారానికి సంబంధించిన విషయాలను బోల్డ్ గా చెప్పడం, బి గ్రేడ్ సినిమాల్లో హీరోయిన్ కూడా అవడంతో... ఆమె ఒక చిన్న సైజు దేశీ శృంగార దేవతగా మారిపోయింది.
undefined
ఓపెన్ గానే సోషల్ మీడియాలో తనను కలవాలంటే స్వాతి బొటిక్ కి రమ్మంటు తన నెంబర్, అకౌంట్ నెంబర్ ఇచ్చే స్వాతి నాయుడు... హఠాత్తుగా 2019 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కొంతకాలం స్వాతినాయుడుకేళి సంబంధించిన వార్తలేవి రాలేదు.
undefined
కొన్ని నెలల తరువాత ఆమె సీమంతం, పండంటి బిడ్డ పుట్టడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఇన్ని రోజులపాటు అన్యోన్యంగానే సాగుతున్న వీరి జీవితంలో ఇప్పుడు భర్త నుండి వేధింపులెక్కువయ్యాయని, తన భర్తను, పాపను వదిలేద్దామనుకుంటున్నట్టుగా చెప్పింది.
undefined
తన దయనీయ పరిస్థితిని చెప్పుకోవడం ఇష్టం లేకున్నప్పటికీ.... తనకు చెప్పుకోకతప్పడంలేదంటూ ఒక వీడియోను షేర్ చేసింది స్వాతి నాయుడు. ఆ వీడియోలో తన బాధను వెళ్లబోసుకుంది ఈ శృంగార తార.
undefined
ఇటీవలే తమకు పాప పుట్టిందని, ఆమెకు అనారోగ్యంగా ఉందని,ఆ టెన్షన్‌ కి తోడుగా ఒకకొత్తఇల్లునుకూడా కడుతున్నామని, ఈ లాక్ డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులు వీటికి తోడవడంతో తనభర్త మద్యానికి బానిసయ్యాడని చెప్పుకొచ్చింది.
undefined
ప్రతిరోజు రాత్రి అవ్వగానే తాగడం మొదలుపెడుతున్నాడని, తాగుతూనే ఉంటాడని,అడిగితే అబద్ధాలు ఆడుతున్నాడని వాపోయింది స్వాతినాయుడు.అందరి తాగుబోతుల్లాగే తన మొగుడు సైతం తాగాలని లేదు అంటూనే మద్యాన్ని విపరీతంగా తాగుతున్నదని వాపోయింది.
undefined
తాను చిన్న పాపతో ఇబ్బందులు పడుతున్నా భర్త పట్టించుకోవడం లేదని, పాపను చూడమన్నా కూడా సరిగాచూడటం లేదని తన బాధను చెప్పుకొచ్చింది.ప్రతి చిన్న విషయానికి కూడా కోప్పడుతున్నాడని,తమ ఇద్దరి మధ్యచాలా గొడవలు అవుతున్నాయని, అసలు ఈపెళ్లి చేసుకుని తాను పెద్దతప్పు చేశానని అనిపిస్తుందని చెప్పింది స్వాతి నాయుడు.
undefined
తన భర్తనుతానుచేసుకోలేదని, తన భర్తే తననుకావాలని ఇష్టపడి వెంటపడిచేసుకున్నాడని, ఆ రోజు ఆ పెళ్లిని తాను చేసుకోకుండా ఉన్న బాగుండేదని ఆమె వాపోయింది.లైఫ్‌లో తాగుడు వల్ల ఇన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలిసి వస్తుందని తాను కలలో కూడా ఊహించుకోలేదని. తాగుడు ఉంటేనేతన బ్రతుకు అన్నట్టుగా భర్త చేయడం తాను తట్టుకోలేకపోతున్నానని చెప్పింది.
undefined
తాగుడు మానేయమంటే మాననుఅంటున్నాడని,అవసరమైతే తనను,పాపను వదిలేస్తానని పరోక్షంగా హెచ్చరిస్తాడనిఆమె తెలిపింది.తన భర్త ప్రవర్తనలో మార్పు రావడంలేదని,ఆస్థి విషయంలో కూడా తన తండ్రితో భర్త గొడవ పెట్టుకున్నాడనిచెప్పుకొచ్చింది.
undefined
ఆ గొడవ సందర్భంగాఇంట్లో సామాన్లు పగలగొట్టేసి,పాపకు పాలు పడుతున్న తననుఇష్టం వచ్చినట్టుగాచేశాడని చెప్పింది. ఆ గొడవ తరువాత మందు కొనుక్కొచ్చుకొని తాగుతుంటే ఆపమని తాను కోరానని, అయినా కూడా వినలేదని, తాను కావాలా మందు కావాలా అంటే మందే కావాలని అన్నాడని చెప్పింది.
undefined
భర్త నానా రభస చేస్తుండడంతో కిందకు వెళ్లి పోలీసులకు తాను చెప్పానని, పోలీసులకు చెప్పడంతో తన భర్త వారు వచ్చి ఎక్కడ కొడతారో అనే భయంతో బ్లేడుతో కోసేసుకున్నాడని, కాళ్ళ మీద, చేతులమీద అనేకచోట్ల కోసుకున్నాడని చెప్పుకొచ్చాడు.
undefined
త్వరలోనే తన భర్తతో తాను విడిపోవడం ఖాయమని చెబుతున్న స్వాతి పాపను, భర్తను కూడా వదిలేయాలనుకుంటుందట. గతంలో కూడా ఆమె అనేకమార్లు పబ్లిసిటీ కోసం ఇలాంటి కథలను అల్లింది. ఇప్పుడు కూడా వ్యూస్ కోసం ఈ కథను అల్లిందా, లేదంటే ఇందులో నిజముందా అనే విషయం తేలాల్సి ఉంది.
undefined
click me!