కోక కట్టిన కోహినూర్ వజ్రం... జబ్బల జాకెట్ లో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా!

First Published Sep 17, 2021, 3:24 PM IST


సుదీర్ఘకాలం నుండి టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలుతుంది తమన్నా. తెలుగు తెరకు పరిచయమై 15ఏళ్ళు దాటిపోగా ఆమె క్రేజ్, మేనియా తగ్గలేదు. స్టార్ హీరోయిన్ గా టాప్ స్టార్స్ తో నటించిన తమన్నా వన్నె తరగని గ్లామర్ తో కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్నారు.
 


పలు చిత్రాలలో హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ లో ఐటెం భామగా  తమన్నా చేస్తున్నారు. వరుణ్-వెంకీల మల్టీస్టారర్ ఎఫ్ 3 మూవీలో నటిస్తున్న తమన్నా, యంగ్ హీరో సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం అనే మూవీ చేస్తున్నారు. వరుణ్ మరో చిత్రం గనిలో ఓ స్పెషల్ లో తమన్నా ఆడిపాడనున్నారు. 

అలాగే నితిన్ మాస్ట్రో మూవీలో తమన్నా నెగిటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్ చేశారు. మొదటిసారి తమన్నా ఈ తరహా రోల్ చేయడం విశేషం. నేడు డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో మ్యాస్ట్రో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 


ఇక గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న సీటీమార్ ఇటీవల విడుదలైంది. కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా తమన్నా  ఆకట్టుకుంది. మూవీ మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 

నవాజుద్దీన్ సిద్దిఖీకి జంటగా బోల్ చుడియా అనే హిందీ చిత్రం చేస్తుంది తమన్నా. అలాగే హిందీ క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మీ మూవీలో తమన్నా నటించగా విడుదల కావాల్సి ఉంది. 


మరో వైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ డిజిటల్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. ఆమె నటించిన డిజిటల్ సిరీస్లు నవంబర్ స్టోరీ, లెవెన్త్ హౌర్ ఆదరణ దక్కించుకున్నాయి. 


ముఖ్యంగా నవంబర్ స్టోరీ లో తమన్నా నటన ఆకట్టుకుంది. మరోవైపు టెలివిజన్ ఎంట్రీకి సిద్ధమైంది. భారీ ఎత్తున్న ఓ వంటల ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు తమన్నా. ఇక లేటెస్ట్ తమన్నా ఫోటో షూట్ వైరల్ గా మారింది. నీలి రంగు శారీ, జాకెట్ ధరించి కోహినూర్ వజ్రంలా దర్శనం ఇచ్చింది తమన్నా. 


జబ్బలు జాకెట్ లో తమన్నా టాప్ అందాలు మరింత కవ్విస్తుంటే, ఆమె కిల్లింగ్ లుక్స్ కుర్ర హృదయాలకు గాయం చేసేవిగా ఉన్నాయి. మొత్తంగా తమన్నా లేటెస్ట్ క్లిక్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. 

click me!