మైండ్ బ్లాక్ చేస్తున్న కీర్తి సురేష్ ఆస్తుల చిట్టా... ఇంత తక్కువ టైంలో అన్ని కోట్లు కూడబెట్టిందా!

First Published Dec 10, 2022, 1:24 PM IST


స్టార్ లేడీ కీర్తి సురేష్ ఆస్తుల చిట్టా బయటకు వచ్చింది. ఆమె సంపాదన, కూడబెట్టిన ఆస్తుల వివరాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. కీర్తి పాప అన్ని కోట్లు వెనకేసిందా అని జనాలు నోరెళ్లబెడుతున్నారు. 
 

Keerthy Suresh

కీర్తి సురేష్ స్టార్ కిడ్. ఆమె తల్లి మేనక హీరోయిన్, తండ్రి సురేష్ డైరెక్టర్. మేనక ఒక దశలో సౌత్ ఇండియాను ఏలారు. వందల సంఖ్యలో చిత్రాలు చేసిన మేనక తెలుగులో చాలా తక్కువ చేశారు. వాటిలో చిరంజీవి 'పున్నమి నాగు' ఒకటి. 
 

Keerthy Suresh

కీర్తి పేరెంట్స్ కి మలయాళ , తమిళ పరిశ్రమల్లో బాగా పలుకుబడి ఉంది. ఈ క్రమంలో కీర్తిని చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం చేశారు. మూడు మలయాళ చిత్రాల్లో కీర్తి సురేష్ బాలనటిగా కనిపించారు. హీరోయిన్ గా మొదటి చిత్రం 2013లో విడుదలైన మలయాళ 'గీతాంజలి'. 
 

Keerthy Suresh

హీరోయిన్ అయ్యాక కీర్తి మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో అధికంగా చిత్రాలు చేశారు. కీర్తి టాలీవుడ్ జర్నీ పరిశీలిస్తే... 2016లో రామ్ పోతినేని హీరోగా విడుదలైన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 
 

keerthy suresh

కొంచెం గ్యాప్ ఇచ్చి నానికి జంటగా చేసిన నేను లోకల్ సైతం సూపర్ హిట్ కొట్టింది. దీంతో ఏకంగా పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అజ్ఞాతవాసి మూవీలో కీర్తి హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో స్టార్స్ పక్కన ఆఫర్స్ రాలేదు. మహానటి మూవీ కీర్తి జీవితాన్ని మార్చేసింది. స్టార్డం తెచ్చిపెట్టింది.


లెజెండరీ హీరోయిన్ సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి అద్భుతం చేసింది. కీర్తికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. అప్పటి నుండి కీర్తికి ఆఫర్స్ వెల్లువెత్తాయి. మహానటి తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వెల్లువెత్తాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా అరడజను కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించారు. 

Keerthy Suresh

కీర్తి నటించిన మరొక టాప్ స్టార్ మహేష్. సర్కారు వారి పాట మూవీలో మహేష్ తో ఆమె జతకట్టారు. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్,  నాని దసరా చిత్రాల్లో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా ఫేమ్ వచ్చాక రెమ్యునరేషన్ పెంచేసిన కీర్తి భారీగా సంపాదిస్తున్నారట. కీర్తి సురేష్ ఆస్తుల చిట్టా ఇదే అంటూ ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. 

Keerthy Suresh


గత నాలుగేళ్లుగా కీర్తి కోటికి తగ్గకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె రూ. 2.5 నుండి 3 కోట్లు తీసుకుంటున్నారట. ఏడాదికి ఐదు సినిమాల వరకు చేస్తున్నారు. ఎలా చూసినా కీర్తి సంపాదన సంవత్సరానికి రూ. 10-15 కోట్లు ఉంటుంది. ప్రచారకర్తగా వచ్చే ఆదాయం అదనం. చాలా కాలంగా స్టార్డం అనుభవిస్తున్న కీర్తి ఇప్పటి వరకు సోలోగా రూ. 50 నుండి 70 కోట్లు కూడబెట్టారట. 

click me!