ఎట్టకేలకు తన ఒరిజినల్ గ్లామర్ బయటపెట్టిన అనసూయ... మేకప్ లేకుండా నేచురల్ ఫోటో షూట్ 

First Published Nov 22, 2022, 5:46 PM IST


మేకప్ లేకుండా ఒరిజినల్ లుక్ లో అనసూయ షాక్ ఇచ్చింది. నేచురల్ ఫోటో షూట్ తో ఆకట్టుకుంది. సదరు ఫోటోలు తన కొడుకు తీశారంటూ మురిసిపోయింది. అనసూయ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 


నటిగా బిజీ అయిన అనసూయ యాంకరింగ్ పక్కన పెట్టారు. తనకు నేమ్ ఫేమ్ తెచ్చిన జబర్దస్త్ తో పాటు పలు బుల్లితెర షోస్ కి గుడ్ బై చెప్పేశారు. ఆమెకు సిల్వర్ స్క్రీన్ పై క్రేజీ ఆఫర్స్ రావడంతో అటువైపుగా అడుగులు వేస్తున్నారు. 
 

 అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.  చిరంజీవి ఓ పవర్ ఫుల్ రోల్ లో మెప్పించారు. కాగా గాడ్ ఫాదర్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనలేదని మెగా ఫ్యాన్స్ అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

షూటింగ్స్ బిజీ కారణంగానే గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో పాల్గొనలేక పోయానని అనసూయ వివరణ ఇచ్చారు. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ శాంతించారు. ఇక వెండితెర ఆఫర్స్ తో పాటు డిజిటల్ సిరీస్లు, సినిమాలలో అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. 
 


అనసూయ ఖాతాలో పుష్ప 2 వంటి పాన్ ఇండియా మూవీ ఉంది. పార్ట్ 1లో అనసూయ దాక్షాయణిగా ఊరమాస్ నెగిటివ్ రోల్ లో మెప్పించింది. నిడివి తక్కువే అయినా అనసూయ తన మార్క్ చూపించింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సీక్వెల్ లో కూడా ఆమె నటిస్తున్నారు. 
 


నటిగా అనసూయ కెరీర్ పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. అదే సమయంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఆంటీ అంటూ వేధింపులకు దిగారు. ఈ వివాదంలో అనసూయ తప్పు కూడా ఉంది. ఆమెనే తన ట్వీట్ తో విజయ్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టారు. చివరకు కొందరిపై ఆమె కేసు కూడా పెట్టారు. 
 


ఈ వివాదంతో అనసూయ కొంత నెగిటివిటీ మూటగట్టుకున్నారు.ఇకనైనా సంబంధం లేని వివాదాల్లో తలదూర్చకుంటే మంచిదని ఆమెకు పలువురు సలహా ఇస్తున్నారు. అయితే అనసూయ ఐ డోంట్ కేర్ అంటుంది. ఎవరేమనుకున్నా నా రూటే సపరేట్ అని ముందుకు వెళుతుంది. 
 

తనను ట్రోల్ చేసేవారిని మరింత రెచ్చగొట్టేలా అనసూయ సోషల్ మీడియా పోస్ట్స్ ఉంటున్నాయి. దీంతో ఆమెపై సోషల్ మీడియా నెగిటివిటీ కొనసాగుతుంది. 
 


పదేళ్ల కెరీర్లో అనసూయ కోట్ల సంపాదనతో సెటిల్ అయినట్లు సమాచారం. దీంతో విమర్శలకు వెరవకుండా తనదైన పంథాలో ముందుకు వెళుతుంది. ఒక్కొక్క కాల్షీట్ కి రూ. 2 నుండి 3 లక్షలు తీసుకుంటున్న ఆమె భారీగా ఆర్జిస్తున్నట్లు వినికిడి. 
 

click me!