బిగ్ డే ముందు పవన్ ఫ్యాన్స్ లో చీలికలు... సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న వైనం!

First Published Mar 13, 2021, 7:22 PM IST

పవన్ కళ్యాణ్ వరుస సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుష్ చేస్తుండగా... పొలిటికల్ నిర్ణయాలు మాత్రం వారికి అసలు మింగుడు పడడం లేదు. తాజాగా తిరుపతి పార్లమెంట్ సీటుకు జరుగుతున్న బై ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ జనసేన తప్పుకుంది. 
 

దేశ, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన లేఖ విడుదల చేశాడు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెజారిటీ జనసేన కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు.
undefined
బీజేపీ కంటే అత్యధిక ఓటు షేర్ కలిగిన జనసేన ఎన్నికల నుండి తప్పుకొని, ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సామాజిక సమీకరణాల పరంగా కూడా కాపు ఓట్లు అధికంగా ఉన్న చోట జనసేన పోటీ చేయడం ఎంతో కలిసొచ్చే అంశం అంటున్నారు.
undefined
జి హెచ్ ఎం సీ ఎన్నికలలో ఇలాగే చేశారు.. మరలా ఇప్పుడు కూడా తిరుపతి సీటు బీజేపీ కి కేటాయిస్తే మన పార్టీ ఉన్నట్లా లేనట్లా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలపడుతున్న సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు.
undefined
ప్రతిసారి వేరే పార్టీకి ఓటు వేయడానికా జనసైనికులు ఉంది అంటూ.. నేరుగా పవన్ కళ్యాణ్ ని అడుగుతున్నారు. ఇలా అయితే జనసేన కోసం సొంత డబ్బులతో ప్రచారం చేయడం దండగ అంటున్నారు.
undefined
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ రాష్ట్రంలో బీజేపీ పట్ల పూర్తి వ్యతిరేకత తెచ్చిందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన జనసేన భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.. బీజేపీ నుండి బయటికి రావాలని కోరుతున్నారు.
undefined
కొందరైతే రాయలేని భాషలో బూతులు తిడతుండగా, కొందరు మాత్రం పవన్ ని సమర్దిస్తున్నారు. అథినేత నిర్ణయాన్ని గౌరవించని వారు నిజమైన జన సైనికులు కాదని అంటున్నారు.
undefined
పవన్ నిర్ణయం వెనుక గొప్ప వ్యూహం ఉంటుందని.. ఒకటి కోల్పోతే పది సీట్లు తెచ్చుకొనే ప్లాన్ అయి ఉంటుందని సమర్థిస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ రెండుగా చీలిపోయారు.
undefined
పవన్ నిర్ణయాన్ని సమర్ధించే వారు, వ్యతిరేకించే వారిగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో సీఎం కాండిడేట్ కూడా పవన్ కాదని... బీజేపీ వాళ్లే తీసుకుంటారని కొందరు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
undefined
తిరుపతి బై పోల్స్ లో జనసేన కార్యకర్తలు అందరూ నోటాకి ఓటు వేయాలని అంటుంటే.. కొందరు అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అంటున్నారు.
undefined
రేపటితో జనసేన స్థాపించి ఏడేళ్లు కావస్తుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ముందు పవన్ ఫ్యాన్స్ లో ఈ చీలికలు పవన్ కళ్యాణ్ కి తలనొప్పిగా మారాయి.
undefined
click me!