Karthika Deepam: ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న ఆనందరావు.. బాధతో గట్టిగా అరిచినా కార్తీక్!

First Published Jan 7, 2022, 10:03 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం  (karthika deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో తెలుసుకుందాం.
 

కార్తీక్ (Karthik)  వాళ్ళు లేరన్న బెంగతో ఆనంద్ రావు రోజు రోజుకు తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. డాక్టర్ భారతి (Bharathi) వచ్చి తన హెల్త్ కండిషన్స్ చెక్ చేసి కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం మంచిదని చెబుతోంది. సౌందర్య కూడా సరే అంటుంది.
 

మరోవైపు కార్తీక్ (Karthik) దీప చేసిన పిండివంటలను ప్యాకింగ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన దీప (Deepa) మీకెందుకింత శ్రమండి అంటుంది. ఖాళీగా తిని కూర్చోవడం నా వల్ల కావడం లేదు ఈరోజు నుంచి నేను నీతో పాటు పిండి వంటలను అమ్మడానికి వస్తా అని చెబుతాడు కార్తీక్.
 

ఇక కార్తీక్ (Karthik) తాను ఇది వరకు ఎలా బ్రతికాడో.. పిల్లలను ఎంత బాగా పెంచాడో ఇప్పుడు ఇలాంటి స్థితికి వచ్చాను అని అనుకుంటాడు. మరోవైపు రుద్రాణి (Rudrani) రోజురోజుకు పెట్టే టార్చర్ గురించి ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తాడు. ఇవన్నీ తలుచుకుని రోడ్డుమీదనే పిచ్చిపట్టిన వాడిలా గట్టిగా అరుస్తాడు కార్తీక్.
 

ఈలోపు అది దూరం నుంచి చూసిన దీప (Deepa)  దగ్గరికి వస్తుంది. చుట్టుప్రక్కల జనాలు కూడా చుట్టుముడతారు. దీప, కార్తీక్ (Karthik)ను ఒక చోట కూర్చోబెట్టి దేనికి దిగులు పడకండి అని ధైర్యం చెబుతుంది దీప.
 

మరోవైపు సౌందర్య (Soundary ) తన భర్త గురించి ఆలోచిస్తూ.. బయటకు మంచిగానే ఉన్నా  మానసికంగా చాలా పొంగిపోతున్నాడని ఆదిత్యకు చెబుతుంది. దీనికి వీరు ఆనంద్ రావ్ (Anand Rao) ను ప్రకృతి వైద్యశాల కి  తీసుకువెళ్లడానికి సిద్ధమవుతారు.
 

ఒకవైపు దీప (Deepa) పిండివంటలు అమ్మడానికి ఒక షాప్ దగ్గరికి వెల్లగా ఆ షాపు ఓనర్ మేము తీసుకోమని చెబుతాడు. ఎందుకంటే రుద్రాణి (Rudrani) కార్తీక్ మీద కుట్రతో తన పేరు మీద పిండివంటలను అక్కడున్న ప్రతి షాప్ కి  సేల్ చేస్తుంది. అది తెలిసిన దీప చాలా బాధగా ఉంటుంది.
 

ఇటు కార్తీక్  (Karthik) తన పిల్లలకు మధ్యాహ్నం భోజనం తీసుకుని వెళ్తాడు. అలా స్కూల్లో కి వెళ్ళి పిల్లలకు లంచ్ బాక్స్ తీసి ఇస్తుండగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. ఆ లంచ్ బాక్స్ కు వేరే ఒక అమ్మాయి తగిలి పడిపోతుంది. ఇక తండ్రి బాధను అర్థం చేసుకున్న హిమ, సౌర్య (Hima, Sourya) మాకు ఆకలిగా లేదని చెబుతారు.
 

అది జీర్ణించుకోలేని కార్తీక్ (Karthik) ఏడుస్తూ.. పిల్లలకు మళ్లీ భోజనం తీసుకొస్తా అని చెప్పి  తిరిగి వెళ్తాడు. ఇక రేపటి భాగం లో కార్తీక్ పిల్లలకు భోజనం ఎలా సద్ది చేస్తాడో చూడాలి.

click me!