జైలర్ 2 లో రజినీకాంత్ విలన్ గా గేమ్ ఛేంజర్ నటుడు?

Published : Feb 17, 2025, 05:54 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించనున్న సినిమా  జైలర్2, జైలర్  సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోన్న ఈసినిమాలో సూపర్ స్టార్ కు పోటీగా గేమ్ ఛేంజర్ నటుడిని రంగంలోకి దింపబోతున్నాడట దర్శకుడు. 

PREV
14
జైలర్ 2 లో  రజినీకాంత్  విలన్ గా గేమ్ ఛేంజర్ నటుడు?
జైలర్ 2 అప్డేట్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా 2023లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు రమ్యకృష్ణ, వసంత్ రవి, మిర్నా, యోగిబాబు, శివ రాజ్ కుమార్, వినాయకన్, తమన్నా, సునీల్, రెడ్డిన్ కింగ్స్లీ వంటి భారీ తారాగణం నటించింది. అనిరుధ్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది.

Also Read: ఎన్టీఆర్ భార్య ప్రణతి కు ఇష్టమైన పాన్ ఇండియా హీరో ఎవరు.? బాగా నచ్చిన సినిమా ఏది?

24
నెల్సన్ దర్శకత్వంలో రజినీ

భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్  దగ్గర 650 కోట్లకు పైగా  వసూళ్లు సాధించింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ ను  సాధించింది. జైలర్ సినిమా తర్వాత రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Also Read: నయనతార, సమంత సిక్స్ ప్యాక్స్ చూశారా, స్టార్ హీరోలకు ఫిట్నెస్ పోటీ ఇస్తున్న బ్యూటీస్

 

34
జైలర్ 2 విలన్ అప్డేట్

కూలీ  సినిమా పూర్తయిన వెంటనే జైలర్ 2 సినిమా పనులు ప్రారంభించనున్నారు రజినీ. మొదటి భాగం కంటే రెండో భాగాన్ని మరింత గ్రాండ్ గా తెరకెక్కించాలని నెల్సన్ భావిస్తున్నారు. మొదటి భాగంలో విలన్ గా నటించిన వినాయకన్ పాత్ర చివరిలో చనిపోవడంతో, రెండో భాగంలో అంతటి టెర్రర్ విలన్ ని తీసుకురావాలని నెల్సన్ అనుకుంటున్నారట.

Also Read: 50 వేల కోట్ల ఆస్తి ఉన్న హీరో, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు కారణం ఏంటి..?

44
జైలర్ 2 లో ఎస్.జె.సూర్య?

తాజా సమాచారం ప్రకారం, జైలర్ 2 చిత్రంలో విలన్ గా నటించడానికి నటుడు ఎస్.జె.సూర్యతో చర్చలు జరుగుతున్నారట. రజినీకాంత్ తో ఇంతకు ముందు కలిసి నటించని ఎస్.జె.సూర్య, జైలర్ 2 ద్వారా తొలిసారి కలిసి నటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ కాంబినేషన్ కనుక ఖరారైతే జైలర్ 2 సినిమా వేరే లెవెల్లో ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తోంది. రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటించి మెప్పించాడు సూర్య. మరి సూపర్ స్టార్ సినిమాలో చేస్తాడో లేదో చూడాలి.

Also Read: సినిమాలు మానేసి, డాక్టర్ గా ప్రాక్టీస్ చేయబోతున్న హీరోయిన్? షాక్ లో ఫ్యాన్స్

 

Read more Photos on
click me!

Recommended Stories