నయనతార, సమంత సిక్స్ ప్యాక్స్ చూశారా, స్టార్ హీరోలకు ఫిట్నెస్ పోటీ ఇస్తున్న బ్యూటీస్

Published : Feb 17, 2025, 04:47 PM IST

హీరోలు సిక్స్ ప్యాక్ లు చేస్తూ.. ఎక్స్ పోజింగ్ లు ఇవ్వడం కామన్. మరి వారికి పోటీగా హీరోయిన్లు కూడా సీక్స్ ప్యాక్ చేస్తే..? సిక్స్ ప్యాక్ చేసిన హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా..? అయితే హీరోలకు పోటీగా ఆరుపలకల బాడీని పెంచిన భామలెవరో చూడండి. 

PREV
16
నయనతార, సమంత సిక్స్ ప్యాక్స్ చూశారా, స్టార్ హీరోలకు ఫిట్నెస్  పోటీ ఇస్తున్న బ్యూటీస్
సిక్స్ ప్యాక్స్ హీరోయిన్లు

సినిమాల్లో హీరోలు కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తుంటారు. జిమ్ముల్లో కుమ్ముతూ.. కఠిన వ్యాయామం చేసి సిక్స్ ప్యాక్స్ ను లక్ష్యంగా పెట్టుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ అల్లు అర్జున్ చేస్తే.. ఆతరువాత ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు నితిన్, సందీప్ కిషన్ లాంటి చిన్న హీరోల వరకూ.. సిక్స్ ప్యాక్ చేసినవారే. అయితే హీరోయిన్లు సిక్స్ ప్యాక్ చేయడం ఎప్పుడైనా చూశారా. హీరోయిన్లు సిక్స్ ప్యాక్స్ వేసుకోవడం గురించి పెద్దగా చర్చ జరగదు. ఈ కోవలో సిక్స్ ప్యాక్స్ ఉన్న  హీరోయిన్ల గురించి చూద్దాం.

Also Read: ఎన్టీఆర్ భార్య ప్రణతి కు ఇష్టమైన పాన్ ఇండియా హీరో ఎవరు.? బాగా నచ్చిన సినిమా ఏది?

26
నయనతార

కొలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార, సినిమాల్లోకి వచ్చిన కొత్తలో లావుగా ఉండేది. తర్వాత అజిత్ తో బిల్లా సినిమా కోసం బరువు తగ్గి స్లిమ్ గా మారింది. విశాల్ తో సత్యం సినిమాలో నటించినప్పుడు, అతనికి పోటీగా సిక్స్ ప్యాక్స్ వేసి గ్లామర్ గా నటించింది.

Also Read:సినిమాలు మానేసి, డాక్టర్ గా ప్రాక్టీస్ చేయబోతున్న హీరోయిన్? షాక్ లో ఫ్యాన్స్

36
సమంత

నటి సమంత కూడా ఫిట్నెస్ ప్రియురాలు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ఆమెకు అలవాటు. ఆమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి వచ్చినా త్వరగా కోలుకోవడానికి ఆమె ఫిట్నెస్ కూడా ఒక కారణం. ఆమె కూడా సిక్స్ ప్యాక్స్ తో ఫోటో షూట్ చేసింది.

Also Read: సినిమాలు మానేసి, డాక్టర్ గా ప్రాక్టీస్ చేయబోతున్న హీరోయిన్? షాక్ లో ఫ్యాన్స్

46
టాప్సీ

జుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా మారిన తాప్సీ ఆతరువాత బాలీవుడ్ కు జంప్ అయ్యింది. బాలీవుడ్ కి వెళ్ళాక తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. దాని ఫలితంగా ఆమె సిక్స్ ప్యాక్స్ తో కనిపించింది. కఠినమైన డైట్ పాటించి ఈ స్థాయికి చేరుకుంది.

Also Read: 50 వేల కోట్ల ఆస్తి ఉన్న హీరో, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు కారణం ఏంటి..?

56
దీషా పటాని

మెగా హీరో వరుణ్ తేజ్ సరసన హీరోయని్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దీషా పటాని. ఈమె కూడా ఫిట్నెస్ ప్రియురాలు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే దీషా, సిక్స్ ప్యాక్స్ ను చాలా సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తోంది.

Also Read: మహేష్ బాబుకు సారి చెప్పిన స్టార్ డైరెక్టర్, కారణం ఏంటి? నిజం ఎంత?

66
సాక్షి అగర్వాల్

బిగ్ బాస్ తమిళ సీజన్ 3 ద్వారా ఫేమస్ అయిన సాక్షి అగర్వాల్ కూడా నిత్యం వ్యాయామం చేసి సిక్స్ ప్యాక్స్ ను సంపాదించింది. దానితో ఆమె చాలా ఫోటో షూట్ లు కూడా చేసింది.

Also Read:మహేష్ బాబుకు సారి చెప్పిన స్టార్ డైరెక్టర్, కారణం ఏంటి? నిజం ఎంత?

 

Read more Photos on
click me!

Recommended Stories