సాగర తీరాన చల్లని సాయంత్రం ఆస్వాదిస్తున్న సింగర్ సునీత... ఆసక్తిరేపుతున్న ఇన్స్టా లేటెస్ట్ పోస్ట్స్!

First Published Jul 1, 2021, 9:26 AM IST

సింగర్ సునీత ఈ మధ్య సోషల్ మీడియా జీవిగా మారిపోయారు. సంతోషమైనా, బాధైనా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. సునీత పెళ్లి, హనీమూన్ పిక్స్ అప్డేట్స్ తో పాటు తన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది.

పరిశ్రమలో తనకు జరిగిన అవమానాలు, కొందరు మానసికంగా క్రుంగదీసిన తీరుపై కూడా సునీత సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఓ దశలో కొందరు తన ఆత్మస్థైర్యం దెబ్బతీసి, కెరీర్ నాశనం చేయాలని చూశారని, అన్నింటినీ తట్టుకొని నిలబడ్డానని ఆమె తెలియజేశారు.
undefined
సోషల్ మీడియాలో సునీత యాక్టీవ్ గా ఉంటున్నప్పుడు నుండి ఆమె గురించి ఫ్యాన్స్ చాలా విషయాలు తెలుసుకుంటున్నారు.  రెండవ పెళ్లి తరువాత సునీత గురించి ప్రతి విషయం వార్తగా మారుతుంది.
undefined
ఆమె రెండవ పెళ్లి వార్త చాలా మందికి షాక్ ఇచ్చింది. ఇది వట్టి పుకారు మాత్రమే అని చాలా మంది కొట్టిపారేశారు. అయితే రామ్ తో ఆమె నిశితార్థం ఫోటోలు బయటికి రావడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.
undefined
మీడియాలో వరుస కథనాలు నేపథ్యంలో సునీత వివరణ ఇచ్చారు. కుటుంబ సభ్యుల అనుమతితో రెండవ పెళ్లి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
undefined
అలాగే తన ఈ నిర్ణయం వెనుక పిల్లలు, తన భవిష్యత్ ఉందని, పెద్ద మనసుతో తన నిర్ణయాన్ని సమర్ధించి, మద్దతుగా నిలవాలని ఆమె కోరుకున్నారు.
undefined
సునీత వివాహం కొడుకు, కూతురు దగ్గరుండి ఘనంగా చేశారు. పెళ్ళిలో ఈ ఘటన చూడముచ్చట్లగా అనిపించింది. కొందరు సునీత పెళ్లిని విమర్శించినా, మెజారిటీ ఫ్యాన్స్ ఆమెకు మద్దతుగా నిలవడం జరిగింది.
undefined
పెళ్లి తరువాత సునీత హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారు. కోరి వచ్చిన రామ్ ఆమెకు అందమైన కొత్త జీవితం అందించినట్లు తెలుస్తుంది. అటు కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా సునీత సంతృప్తికరంగా కనిపిస్తున్నారు. దానికి ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ నిదర్శనం.
undefined
తాజాగా సాగర తీరానా సముద్రపు అలలు, చల్లగాలిని ఎంజాయ్ చేస్తున్న ఆహ్లాదకర ఫోటోను సునీత సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆనందంతో ఆమె అందం మరింత ఎక్కువ కాగా లేటెస్ట్ ఫోటో వైరల్ గా మారింది.
undefined
click me!