తల్లికి కోపం వస్తే తండ్రితో పడుకున్నావంటోందిః సింగర్‌ చిన్మయి సంచలన కామెంట్‌

First Published Apr 14, 2021, 2:14 PM IST

సౌత్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై మూడేళ్ల క్రితం పెద్ద ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన సింగర్‌, వాయిస్ట్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తాజాగా మరో సంచలన విషయాన్ని వెల్లడించింది. ఓ తల్లి కూతురుని, తండ్రితో పడుకున్నావని వేధిస్తుందంటూ తెలిపి సంచలనాలకు తెరలేపింది. 

సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, టెలివిజన్‌ ప్రజెంటర్‌గా, బ్లూ ఎలిఫెంట్‌ అనే వాయిస్‌ ట్రాన్స్ లేషన్‌ సర్వీస్‌కి హెడ్‌గా ఉంది చిన్మయి శ్రీపాద. సమంతకి డబ్బింగ్‌ చెప్పి పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ మధ్య బాలీవుడ్‌లో `మీటూ` ఉద్యమం ఊపందుకోగా, సౌత్‌లోనూ ఆ చీకటి కోణాలను వెల్లడించింది చిన్మయి. రైటర్‌ వైరముత్తు, రాధారవి వంటి కొందరు ప్రముఖుల పేర్లు, వారి వేధింపులను తెలియజేసి షాక్‌కి గురి చేసింది.
undefined
అడపాదడపా చిత్రపరిశ్రమలో, అలాగే అమ్మాయిలపై వేధింపులకు సంబంధించిన విషయాలను తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడిస్తూనే ఉంది. చాలా మంది అమ్మాయిలు తమకు ఎదురైన సంఘటనలను చిన్మయికి మొరపెట్టుకుంటున్నారు. అందులో కొన్నింటిని బహిర్గతం చేస్తుంది చిన్మయి.
undefined
అందులో భాగంగా తాజాగా తనకు వచ్చిన ఓ మెసెజ్ గురించి చెప్పుకొచ్చింది చిన్మయి. అందులో ఒక అమ్మాయి తన తల్లి వేధింపులను వెల్లడించింది. ఆ తల్లికి కోపం వచ్చినప్పుడల్లా `తన తండ్రితో సంబంధం ఉంది..తండ్రితో పడుకున్నావ్` అంటూ నీచంగా మాట్లాడుతుందట. అమ్మ అలా చిన్నతనం నుంచి తిడుతూనే ఉందని వాపోయింది. దీనిపై చిన్మయి స్పందించింది.
undefined
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అమ్మాయి చెప్పిన విషయాలను పంచుకుంది. `ఇలాంటి ఎన్నో సందేశాలు నాకు చాలా వస్తున్నాయి. ఇలాంటి ఘటనల వల్ల మనకు మన శరీరమన్నా, సెక్స్ అన్నా, రొమాన్స్ అన్నా చిరాకు పుడుతుంది. సాధారణ అమ్మాయిలమైన మనకు ఇలాంటివే ఎదురవుతుంటాయి. వేశ్యగా ముద్ర వేస్తుంటారు. ఇలా మమ్మల్ని తిట్టకుండా ఉండగలరా? అది మీకు సాధ్యమేనా? అని చిన్మయి ప్రశ్నించింది.
undefined
ఈ చెత్తనంతా చదివితే.. అది తప్పని మీకే తెలుస్తోంది. మాతా పిత్ర గురు దైవం అనే చెప్పే మాటల్లోనే అంతా దాగి ఉంది. అలా చెప్పి వారిని గొప్ప వారిగా చిత్రీకరించి మనల్ని కట్టి పడేస్తున్నారు. అది మన కర్మ అనుకుని అంతా భరించాల్సి వస్తుంది. అది తప్పని తెలిసినా కూడా నువ్ ఓ మహిళవి అయినందుకు మైనర్‌వి అయినందుకు దురదృష్టవశాత్తు వాటన్నింటిని భరించాల్సిందే.
undefined
మనల్ని వారు కన్నారు కదా? అని అన్నీ భరించాల్సిన పని లేదు. మనకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చే వరకు అలాంటి తప్పవు. కానీ ఇండియాలో అది జరగదు. చదువులు అయినా కాకపోయినా వెంటనే పెళ్లిళ్లు చేసేస్తారు.. ఆ వెంటనే పిల్లల్ని కనాల్సి వస్తుంది.. అందుకే ఇలాంటి వాతావరణంలో అలాంటి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఉంటే.. మంచివాడిని చూసుకుని భర్తగా ఎంచుకోవాలి. అలా తిట్టడం మరీ దారుణం` అని వాపోయింది చిన్మయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
undefined
నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ భార్య అయిన చిన్మయి శ్రీపాద ప్రస్తుతం సమంతతోపాటు, లావణ్య త్రిపాఠి, కళ్యాణి ప్రియదర్శన్‌, త్రిష వంటి వారికి డబ్బింగ్‌ చెబుతుంది. సింగర్‌గానూ బిజీగా ఉంది. అదే సమయంలో ఛారిటీ కోసం పాటలు పాడుతూ తన గొప్ప మనసుని చాటుకుంటోంది చిన్మయి.
undefined
click me!