షాకింగ్ ఫొటోలు: శ్వేతాబసు ఇలా ఉందేంటి.. డిప్రెషన్ తోనేనా?

First Published May 9, 2020, 12:21 PM IST

అప్పట్లో  'కొత్త బంగారు లోకం'లో మనకు పరిచయమై  'ఎ.. క్క.. డా..' అంటూ మనను  పలకరించిన బెంగాలీ బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్ మర్చిపోవటం కష్టమే. తొలి సినిమాతోనే మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనే పేరొచ్చింది. కానీ, ఆ తర్వాత శ్వేతా జీవితంలో ఊహించని అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి.  వ్యభిచారం కేసులో పాపం ఆమె ఇమేజ్‌ డ్యామేజ్‌ అయింది. ఆ తర్వాత బాలీవుడ్‌ ప్రముఖ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ తన నిర్మాణ సంస్థ ‘ఫాంటమ్‌ ఫిల్మ్స్‌’లో ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు. అక్కడే ఫిల్మ్‌మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌తో శ్వేతకు పరిచయమైంది. ఆ తర్వాత అది పెళ్లికి దారి తీసింది. అయితే ఆ ముచ్చటా ఎన్నో రోజులు లేదు. ఇద్దరూ విభేధాలతో విడిపోయి విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా ఆమె లాక్ డౌన్ టైమ్ లో కొన్ని ఫొటోలు వదిలింది. ఆ ఫొటోలు చూసిన వారు షాక్ అవుతున్నారు. అయితే ఆమె శ్వేతా బసు లాగ లేదని అంటున్నారు. ఆ ఫొటోలు చూస్తే మీరు కూడా అదే మాట అంటారు..చెక్ చేయండి.

చిన్నవయస్సులోనే మకిడి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చి..తర్వాత పద్దెనిమిదేళ్ళకే ‘కొత్తబంగారు లోకం’తో హీరోయిన్‌గా తెలుగు సినీ ప్రపంచలోకి అడుగుపెట్టింది శ్వేత బసు ప్రసాద్.
undefined
తర్వాత తెలుగులో నాలుగైదు సినిమాలు చేసినా అవి ఆమె కెరీర్‌ను స్పీడెక్కించలేదు. అయితే అనుకోనివిధంగా సెక్స్ స్కాండల్ లో ఇరుక్కుని కోర్టుకు ఎక్కి బయిటపడింది.
undefined
శ్వేత బసు కష్టాల్లో ఉన్నప్పుడు సాయిపడతాను అని హామీ ఇచ్చిన వారు ఎవరూ తర్వాత కనపడలేదు కానీ ఆమెకు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కాస్యప్ తన ఆఫీస్ లో స్క్రిప్టు కన్సల్టెంట్ గా జాబ్ ఇచ్చి ఆదుకున్నారు. దాంతో ఆమె లైఫ్ కాస్త గాడిలో పడింది.
undefined
ఇదే సమయంలో శ్వేతాను పలు వివాదాలు కూడా చుట్టూ ముట్టాయి. దీంతో ఆమె అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2018 డిసెంబర్‌ 13న ఆమె బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైయినా ఏడాదికే వారిద్దరు విడాకులు తీసుకున్నారు.
undefined
పెళ్లయిన కొద్ది రోజులకే వారి వైవాహిక దాంపత్యంపై అనేక ఊహాగానాలు వెలువడగా.. తాజాగా ఈ విషయంపై శ్వేతాబసు క్లారిటీ ఇచ్చింది. మేం చట్టపరంగా విడాకులకు దరఖాస్తు తీసుకున్నాం కానీ.. భార్యాభర్తల కంటే ముందు నుంచి తాము మంచి స్నేహితులమని చెప్పింది. అతడు అద్భుతమైన దర్శకుడు. ఏదో ఒకరోజు మళ్లీ కలిసి పనిచేస్తామన్న నమ్మకముంది.
undefined
మేం ఐదేళ్లుగా ఎంతో ప్రేమగా, ఆరోగ్యంగా నిజాయితీగా అనుబంధాన్ని కొనసాగించాం. రోహిత్, తాను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
undefined
ప్రతి పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవలేమని, అంతమాత్రాన ఆ పుస్తకం చెడ్డది కాదని, తమ వైవాహిక జీవితం కూడా ఓ అసంపూర్ణ పుస్తకం లాంటిదేనని నిర్వేదం వెలిబుచ్చింది.
undefined
ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో నా తల్లిదండ్రులను చూడటానికి ఓ ప్లాన్‌ చేశాం. నా తల్లి, సోదరుడు నేను ఉంటున్న బిల్డింగ్‌ వద్దకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వారు పైకి రావడానికి వీలుపడలేదు. దీంతో నేను కిందికి వెళ్లి వాళ్లను కలిశాను. ఐదు ఫీట్ల దూరంలో నిల్చుని వారితో 10 నిమిషాల సేపు మాట్లాడాను.
undefined
కనీసం నా తల్లి హగ్‌ చేసుకోకపోవడం చాలా బాధ అనిపించింది. ఇది చాలా కష్ట సమయం.. త్వరలోనే ఇది వెళ్లిపోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. అయితే ఇతర పనులు మీద దృష్టి సారించడం ద్వారా దీని నుంచి బయటపడేందుకు కృషి చేస్తున్నట్టు’ శ్వేతా చెప్పారు.
undefined
‘నా జీవితంలో ఎప్పుడు ఇతరులతో కలిసే ఉన్నాను. తొలుత నా తల్లిదండ్రులు.. ఆ తర్వాత నాకు పెళ్లయింది. ఆ తర్వాత భర్త నుంచి విడపోయాక తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటున్నాను. నేను గతేడాది డిసెంబర్‌లో డిప్రెషన్‌కు లోనుకావడంతో.. ఇందుకు సంబంధించి చికిత్స తీసుకున్నాను. మొత్తం రెండు సెషన్స్‌లో ఇది పూర్తయింది. నేను బాగానే ఉన్నాను అంది.
undefined
శ్వేతా బసు ప్రసాద్‌ ఇటీవల డిప్రెషన్‌లోని వెళ్లినట్టుగా తెలుస్తోంది. తన మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నట్టు శ్వేతా వెల్లడించారు.ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందుఉన్న వీడియో కాల్ ద్వారా థెరపిస్ట్‌తో మాట్లాడుతూ సలహాలు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు.
undefined
ఇప్పుడు చాలా మంది ఇలాగే ఇబ్బంది పడతారని నా థెరపిస్ట్‌ నాకు చెప్పారు. నా మానసిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నాను.. కానీ ఈ సమయంలో నా విజ్ఞతను కోల్పోదలచుకోలేదు. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది.. అందుకే ఇలాంటి సమయాల్లో దాని కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నా తల్లిదండ్రులను చాలా మిస్సవుతున్నాను అని చెప్పుకొచ్చింది.
undefined
click me!