సౌత్ సినిమాలో ముఖ్యంగా తెలుగు, తమిళ తెరపై ఒక వెలుగు వెలిగింది ఖుష్బు. సీనియర్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది బ్యూటీ. ఆమె మీద ప్రేమతో తమిళ నాట ఖుష్బు ఫ్యాన్స్ ఏకంగా గుడి కట్టారంటే ఆమె ఇమేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ విషయం సెన్సేషన్ కూడా అయ్యింది. ఈ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు మాజీ హీరోయిన్.