తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేసిన సమంత ఆతరువాత నాగచైతన్య తో సీక్రేట్ లవ్ కొనసాగించింది. ఏడేళ్లు ప్రేమించుకున్న వీరు 2017 లో పెళ్ళి చేసుకున్నారు. కాని నాలుగేళ్లు కాపురం చేయకుండానే 2021 లో వీరు విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత కోలుకోవడానికి టైమ్ పట్టింది. నెటిజన్ల ట్రోలింగ్ వల్ల ఇబ్బందిపడ్డ సామ్.. ఆధ్యాత్మిక మార్కం ఎంచుకున్నారు.
ఆతరువాత కొంత కాలానికి కోలుకున్నా.. మయోసైటిస్ మహమ్మారి వ్యాధి బారిన పడి మరోసారి కోలుకోలేని దెబ్బ తిన్నారు సమంత. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ వ్యాధిని కూడా జయించి.. సినిమాలు చేసుకుంటూ.. తన స్టార్ డమ్ ను నిలబెట్టుకున్నారు. ఇప్పటికీ అదే స్టార్ డమ్ తో టాలీవుడ్, బాలీవుడ్ లలో సినిమాలు చేస్తోంది సమంత.
Also Read: పహల్గాం ఉగ్రదాడిపై ట్వీట్, షారుఖ్ ఖాన్ పై ట్రోలింగ్