Published : Apr 28, 2025, 08:53 AM ISTUpdated : Apr 28, 2025, 08:55 AM IST
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. ఈ రెండేళ్లలో ఎన్టీఆర్ సినిమాల జాతర జరగబోతోంది. వరుసగా తారక్ సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ అయిపోయింది. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. దీంతో పాటు దేవర2 సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ పై దండయాత్ర చేసింది. రీసెంట్ గా జపాన్ లో కూడా ఈ సినిమాకి భారీ ఆదరణ దక్కింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో దేవర సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమా స్టార్ట్ అవ్వకమేందే బజ్ భారీగా పెరుగుతోంది. అసలు దేవర కొడుకుఏమయ్యాడు.. అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ ఇతర సినిమాల్లో బిజీగా ఉండటంతో.. దేవర సీక్వెల్ ఇప్పట్లో లేదు అనుకున్నారు ఫ్యాన్స్. పైగా ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ భారీగా బరువు తగ్గారు. భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది ప్రశాంత్ నీల్ మూవీ. దాంతో ఇప్పుడు దేవర2 స్టార్ట్ అవ్వదేమో అనుకున్నారం. కాని తాజాగా నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పై లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది.
ఇప్పటికే దేవర పార్ట్ 2కు సబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను డైరెక్టర్ కొరటాల పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు కూడా మొదలు పెట్టనున్నట్లు సమాచారం. దేవర సినిమా విషయంలో జరిగిన కొన్ని తప్పులు.. పార్ట్ 2 మూవీలో రిపిట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారట టీమ్. అందుకు తగ్గట్టుగా షూటింగ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.
ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనులను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్ తో వర్క్ చేస్తారట. పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే అంతకు ముందు వరకూ ఈసినిమాకు సబంధించి ఎన్టీఆర్ ఇన్వాల్మెంట్ లేని పనులన్నీ కంప్లీట్ చేయాలని కొరటాల ప్లాన్ చేసుకున్నాడట.
ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించారు. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కాని దేవర సినిమాలో జాన్వీ పాత్ర పరిమితంగానే ఉంది. పార్ట్ 2లో జాన్వీ పాత్రకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఇక సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. దేవర పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.