సమంతా రూత్ ప్రభు 38వ పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె నటించిన అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల గురించి తెలుసుకుందాం. అయితే ఇందులో నలుగురు తెలుగు హీరోలుండగా, ఒకే ఒక్క స్టార్ హీరోతో నాలుగు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. సమంత ఆయన్ని లక్కీ ఛార్మ్ గా భావిస్తుంది. మరి ఆ కథేంటో ఇందులో తెలుసుకుందాం.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీమణులలో ఒకరైన సమంతా రూత్ ప్రభు 38 ఏళ్ళ వయసులోకి అడుగుపెట్టారు. ఆమె 1987 ఏప్రిల్ 28న ఆమె చెన్నైలో జన్మించారు. సమంతా తన కెరీర్‌లో అనేక హిట్ చిత్రాలలో నటించారు. ఆమె కెరీర్‌ని మార్చిన సినిమాలు, ఆమెకి లైఫ్ ఇచ్చిన హీరోలు చాలానే ఉన్నారు. ఇందులో తెలుగు హీరోలే ఎక్కువగా ఉండటం విశేషం.