సమంత, రష్మిక, సాయిపల్లవి, కాజల్‌, విజయ్‌.. టెన్త్, ఇంటర్‌లో టాప్‌ లేపేశారుగా.. మార్కులు తెలిస్తే షాకే

First Published Sep 12, 2021, 6:02 PM IST

టాలీవుడ్‌లో స్టార్స్ గా రాణిస్తున్న సమంత, రష్మిక మందన్నా, సాయిపల్లవి, కాజల్‌, విజయ్‌ దేవరకొండ, నిత్యా మీనన్‌, విజయ్‌ సేతుపతి.. చదువుల్లోనూ ఫస్టే ఉన్నారు. వీరు టెన్త్, ఇంటర్‌లో సాధించిన మార్కులు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. 
 

జనరల్‌గా చదువు అబ్బకనే సినిమాల్లోకి వచ్చారని అంటుంటారు. అది ఒకప్పటి మాట. చదువుల్లోనూ ఆరితేరి, సినిమాల్లోకి రావడం ఇప్పటి మాట. వృతి కంటే ప్యాషన్‌పై దృష్టి పెట్టి, దాంటో రాణించాలనుకోవడం
 నేటితరం ఆలోచన. ప్రస్తుతం స్టార్లుగా రాణిస్తున్న చాలా మంది తారలు చదువుల్లోనూ ఆరితేరారు. ఫస్ట్ క్లాస్‌ల్లో పాస్‌ అయ్యారు. వాళ్లెవరో ఓ లుక్కేద్దాం. 
 

సమంత ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం. స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. నాగచైతన్యతో మ్యారేజ్‌ విషయంలో వివాదాల్లో ఇరుక్కున్న సమంత చదువుల్లోనూ ఫస్టే ఉంది. ఆమె టెన్త్ లో 88.7శాతం మార్కులను సాధించింది. ఇంటర్‌లో 72 శాతం దక్కించుకోవడం విశేషం. సమంత కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది.

నేషనల్‌ క్రష్‌గా రాణిస్తుంది రష్మిక మందన్నా. కన్నడలో నటిగా కెరీర్‌ని స్టార్ట్ చేసి, తెలుగు, తమిళం నుంచి ఇప్పుడు బాలీవుడ్‌లో పాగా వేస్తుంది. ఈ క్యూట్‌ బ్యూటీ చదువుల్లో టాప్‌లోనే ఉన్నారు.  పదో తరగతిలో రష్మిక 88శాతం సాధిస్తే, ఇంటర్లో 82 శాతం మార్కులు దక్కించుకుంది. స్టడీస్‌లో పీజీ చేస్తుంది.

Kajal aggarwal

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో కాజల్‌ ఒకరు. ప్రస్తుతం గౌతమ్‌ కిచ్లుని పెళ్లి చేసుకుని ముంబయిలో సెటిల్‌ అయ్యింది. అయినా తెలుగు సినిమాలు చేస్తుంది. కాజల్‌ నటనలో ఎంత పీక్‌లోకి వెళ్లిందే, స్టడీస్‌లోనూ టాప్‌లోనే ఉంది. ఆమె టెన్త్ లో 80శాతం మార్కులు తెచ్చుకుంటే, ఇంటర్‌లో 71శాతం సాధించిందట. ప్రస్తుతం పీజీ కూడా కంప్లీట్‌ చేసిందని టాక్‌.

సాయిపల్లవి మోస్ట్ టాలెంటెడ్‌ యాక్ట్రెస్‌. జీరో సైజ్‌లో ఉన్నా, అందంలో అదరహో అనిపిస్తూ, డాన్సులో దుమ్ములేపుతుంది సాయిపల్లవి. స్టడీలోనూ ఆమె తోపే అని చెప్పొచ్చు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన సాయిపల్లవి ప్రస్తుతం ప్రాక్టీషన్‌ స్టేజ్‌లో ఉంది. అయితే ఈ అమ్మడు టెన్త్ లో 88శాతం సాధిస్తే, ఇంటర్లో 85శాతం సాధించి టాప్‌లో ఉంది.

సౌత్‌లో విలక్షణ పాత్రలతో రాణిస్తుంది నిత్యా మీనన్‌. ప్రస్తుతం పవన్‌తో `భీమ్లా నాయక్‌`లో మెరవబోతున్న నిత్యా మీనన్‌ టెన్త్ లో 75శాతం, ఇంటర్‌లో 72శాతం మార్కులు సాధించిందట. నిత్యా జర్నలిజం చేసిన విషయం తెలిసిందే.
 

విజయ్‌ దేవరకొండ `అర్జున్‌` చిత్రంతో స్టార్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఇప్పుడు నటుడిగా, హీరోగా నెక్ట్స్ లెవల్‌కి చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన సైతం చదువుల్లో ఫాస్టే ఉన్నారు. విజయ్‌ టెన్త్ లో 80శాతం మార్కులు సాధిస్తే, ఇంటర్‌లో 75శాతం పొందడం విశేషంగా చెప్పాలి. 

vijay sethupathi

సౌత్‌లో అత్యంత టాలెంటెడ్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి. ఆయన కూడా స్టడీస్‌లో మంచి స్థానంలోనే ఉన్నారు. టెన్త్ లో ఆయన 70శాతం సాధిస్తే, ఇంటర్‌లో కూడా 70శాతం మార్కులతో పాస్‌ అయ్యారు. 

click me!