ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? 28 ఏళ్ళ పాకిస్తాన్ నటిని ఆయన పెళ్ళి చేసుకోబోతున్నారా? బాలీవుడ్ హీరోయిన్ చెప్పినమరికొన్ని షాకింగ్ విషయాలు
ఇండియాలో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ అంటే అది బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మాత్రమే. 60 ఏళ్లకు అడుగు దూరంలో ఉన్న సల్మాన్ ఇక పెళ్ళఇ చేసుకుండాడో లేదో లే అని అడగడం కూడా మానేశారు ఫ్యాన్స్. అయితే తాజగా ఆయన పెళ్ళి వార్త బాలీవుడ్లో షికారు చేస్తోంది. ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని ఓ బాలీవుడ్ నటి కొత్త బాంబు పేల్చింది.
నటుడు సల్మాన్ ఖాన్‌కు బాలీవుడ్‌లో పడి చచ్చే హీరోయిన్లు లేరంటే నమ్మండి. 50 ఏళ్లు దాటినా కూడా సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కు 59 ఏళ్ల వయస్సు.
ఇంకా ఇండియాలో వేల సంఖ్యలో అమ్మాయిలు సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఇండియాలో ఉన్న అమ్మాయిలందరినీ వదిలేసి సల్మాన్ ఖాన్ తనకంటే 31 ఏళ్లు చిన్నదైన పాకిస్తాన్ నటిని పెళ్లి చేసుకోబోతున్నాడంట.
దీని గురించి బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మాట్లాడుతూ, పాకిస్తాన్‌కు చెందిన ఆ 28 ఏళ్ల నటి ఎవరనేది ఫోటోతో సహా పరిచయం చేసింది. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోబోయే పాకిస్తాన్ నటి పేరు హానియా అమీర్ అని రాఖీ సావంత్ చెప్పింది. ఈమె సల్మాన్ ఖాన్ కంటే 31 ఏళ్లు చిన్నది. అయినా రాఖీ వైరల్ వీడియోలో 28 ఏళ్ల ఈ నటిని తన బాబీ (అత్త) అని అంటోంది.
రాఖీ సావంత్ యొక్క ఈ వైరల్ వీడియోకు చాలా కామెంట్స్ వచ్చాయి. 'రాఖీ వైరల్ వీడియోను చూసి ఒక నెటిజన్ 'ఈమె మెంటల్' అని రాశాడు. మరొక యూజర్, 'ఈమె ఎలాంటి మత్తు పదార్థం వాడుతుందో తెలియదు' అని చెప్పాడు. మరొక యూజర్, 'ఆంటీ ఏం మాట్లాడుతున్నారు' అని రాశాడు. మరొక యూజర్, 'ఎవరైనా ఈమెను మెంటల్ ఆసుపత్రికి తీసుకువెళ్లండి' అని కామెంట్ చేశాడు.
హానియా అమీర్ పాకిస్తాన్‌లో బుల్లితెర, వెండితెర నటి. ఆమె 2017లో 'దిత్లీ' కార్యక్రమంతో టీవీకి వచ్చింది. ఆ తర్వాత ఆమె పాకిస్తాన్‌లో 'అనా', 'నా మాలూమ్ అఫ్రాడ్ 2', 'పర్వేస్ హే జునూన్', 'మేరే హంసఫర్' మరియు 'కబీ మై కబీ తుమ్' వంటి కార్యక్రమాలు చేసింది. ఆతరువాత సినిమాల్లో కూడా నటించింది. ఈమె సల్మాన్ ఖాన్ యొక్క ప్రేయసి అని నటి రాఖీ సావంత్ కొత్త బాంబు పేల్చడంతో బాలీవుడ్‌లో కలకలం రేగింది. మరి నిజం ఎంతో తెలియాల్సి ఉంది.