Nayanthara Rejects Lady SuperStar Title : సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఫ్యాన్స్ కు ఓ రిక్వెస్ట్ చేసింది. నన్ను అలా పిలవడం మానేయండి అంటూ అభిమానులను బ్రతిమలాడుకుంది. ఇంతకీ నయనతార ఏమంటుంది.?
Nayanthara Rejects Lady SuperStar Title : సౌత్ సినిమాలో నయనతార స్టార్ డమ్ ఉన్న హీరోయిన్. 40 ఏళ్ళు దాటినా.. ఆమె ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఫామ్ లో ఉన్న కుర్ర హీరోయిన్లకంటే ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటూ.. ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఆమె డిమాండ్ అంతకంతకు పెరిగిపోతోంది. ఇక ఇంత స్టార్ నటికి ముందు ఏదో ఒక బిరుదుపెట్టడం కామన్ కదా..?
చిరంజీవిని మెగాస్టార్ అంటారు, బాలయ్య ను నట సింహం అంటారు, తమిళంలో అజిత్ కుమార్‌ని తల, ఏకే అంటారు. అంటే ఆయన్ను దేవుడిలా కొలుస్తారు ఫ్యాన్స్. అయితే ఆయన మాత్రం నన్ను దేవుడు అని పిలవద్దు అని ఫ్యాన్స్ కు స్ట్రిక్ట్ గా చెప్పాడు.
కమల్ హాసన్ కు కూడా లోకనాయకుడు అనే బిరుదు ఉంది. ఆయన కూడా నన్ను అలా పిలవద్దు అన్నాడు. వారి బాటలోనే ఇప్పుడు నయనతార కూడా చేరింది.
లేడీ సూపర్‌స్టార్ అని తనను పిలవద్దు అంటోంది. నయనతారని లేడీ సూపర్‌స్టార్ అని ఫ్యాన్స్ ముందుగ్గా పిలుస్తుంటారు. సౌత్ లో ఆ బిరుదు ఇదివరకు విజయశాంతికి ఉండేది. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలదో దూసుకుపోయింది.
స్టార్ హీరోలను మించి ఇమేజ్ ను సాధించింది. ఆతరువాత నయనతాకే ఆ బిరుదు వచ్చింది. కాని ఆమె మాత్రం ఇకపై నన్ను నయనతార అని పిలిస్తే చాలు, లేడీ సూపర్‌స్టార్ అని పిలవద్దు అని అంటోంది.
నయనతార ఒక ప్రకటన చేసింది. అందులో, నన్ను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. నా జీవితం ఒక పుస్తకం లాంటిది. నా సక్సెస్‌లో మీ అందరి పాత్ర ఉంది. నన్ను ఆదరించినందుకు థాంక్స్. నన్ను మీరు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు అది చాలు నాకు అని అన్నారు.
Nayanthara Said That Dont Call me as a Lady Superstar
అంతే కాదు నన్ను లేడీ సూపర్‌స్టార్ అని పిలిచారు. మీ ప్రేమకి నేను రుణపడి ఉంటాను. ఇకపై నన్ను నయనతార అని పిలిస్తే చాలు. నటిగా నాకు అవార్డులు ఎన్నో వచ్చాయి. బిరుదులు ఉన్నాయి. కాని నన్ను నన్నుగా గుర్తించండి చాలు నయనతార అని పిలిస్తే చాలు అన్నారు.
నా పేరు నాకు ఎప్పుడూ దగ్గరే. మీ సంతోషంలో నా కష్టం కూడా ఉంటుంది. సినిమా మనల్ని కలిపేది. మనం అందరం కలిసి సెలెబ్రేట్ చేసుకుందాం. ప్రేమతో, నయనతార. అంటూ ముగించారు. ఇలా నయనతార కూడా తనకు ఎటువంటి బిరుదులు వద్దు అంటూ ప్రకటించారు.