అమరన్ మూవీ కోసం సాయి పల్లవి షాకింగ్ రెమ్యునరేషన్ ..? హీరో కంటే తక్కువేం కాదు..

First Published | Jan 9, 2025, 7:48 PM IST

సాయిపల్లవి గురించి ప్రత్యుకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమా సెలక్షన్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే సాయి పల్లవి తాజాగా అమర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. ఆసినిమాకు సాయి పల్లవి ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా..? 
 

Sai Pallavi

సాయి పల్లవి హీరోయిన్లలో ఆమె చాలా డిఫరెంట్ .. సాయి పల్లవి సినిమా చేయాలి అంటే కథ నచ్చాలి. క్యారెక్టర్ నచ్చాలి, యాక్టింగ్ స్కోప్ ఉండాలి. హీరో డామినేషన్ ఉండకూడదు. ఇలా ఆమె పెట్టుకున్న ప్రిన్సిపుల్స్ చాలానే ఉన్నాయి. ఎక్స్ పోజింగ్ చేయదు, పొట్టిబట్టులు వేసుకోదు, ఓవర్ రొమాన్స్ ఉండదు.

పక్కింటిపిల్లలా ఉంటుంది సాయి పల్లవి. ఆమె సెలక్ట్ చేసుకునే సినిమాలు కూడా అలానే ఉంటాయి. ఇక ఇన్ని నియమాల మధ్య హీరోయిన్ కెరీర్ సాఫీగా సాగుతుందా అంటే.. వేరే ఎవరైనా ఇండస్ట్రీ నుంచి ఎప్పుడో ఫెయిడ్ అవుట్ అయ్యేవారేమో.

Also Read: రజినీకాంత్ సినిమా లో బాలయ్య ను ఎందుకు తీసుకోలేదు...వీరిద్దరి కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

Sai Pallavi

కాని.. సాయి పల్లవికి ఇలా ఉండటం వల్లే డిమాండ్ ఇంకా పెరుగుతుంది. మంచిమంచి ఆఫర్లు వస్తున్నాయి. మంచిమంచి కథలు, క్యారెక్టర్లు చేయగలుగుతుంది. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆమె డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్లే పిలిచి మరీ కోట్లు కుమ్మరించేస్తుంన్నారు. కాని నిర్మాత నష్టంలో ఉన్నాడు అంటే తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయడానికి కూడా వెనకాడదు సాయి పల్లవి. పడి పడి లేచే మనసు సినిమా విషయంలో అదే జరిగింది. 

Also Read: మళ్ళీ రొమాన్స్ మొదలెట్టిన సుడిగాలి సుధీర్ ‌- రష్మి


Siva karthikeyan, sai Pallavi, Amaran

ఇక ఆ విషయం పక్కన పెడితే..రీసెంట్ గా సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈసినిమా.. చిన్న సినిమాగా వచ్చి.. 300 కోట్ల వరకూ కలెక్ట్ చేసి.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఈమూవీలో శివకార్తికేయన్ జోడీగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది అంతే కాదు ఈసినిమా సక్సెస్ లో సాయి పల్లవి పాత్ర కీలకం. 

Also Read: హీరోగా అనిల్ రావిపూడి.. నిజామాబాద్ ప్రజల సాక్షిగా ఏం చెప్పాడంటే..?

Sai Pallavi about Amaran film success

అయితే ఈసినిమా కోసం ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా..? ఈ సినిమా కోసం ఆమె రెమ్యూనరేషన్ గా ఎంత తీసుకుంది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం ఆమె దాదాపు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సాయి పల్లవి ట్రెండ్ నడుస్తుంది. 

Also Read:నయనతారపై ధనుష్ 10 కోట్ల దావా కేసు.. కోర్టు సంచలన తీర్పు..?

నిజంగా చెప్పాలంటే సాయి పల్లవి కోసం 10 కోట్లు కాదు 20 కోట్లైన ఇచ్చి  సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారనే చెప్పాలి…ఇక త్వరలో  తండేల్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈమూవీ కూడా సాయి పల్లవికి డిఫరెంట్ ఇమేజ్ తీసుకువస్తుందని చెప్పాలి. 

Latest Videos

click me!