అలా అనకండి ముందు ముందు సినిమా చేయాల్సి రావచ్చు.. మీరు ఇలా అంటే కష్టం అవుతుంది అని శ్రీముఖి సరదాగా అన్నారు. ఇలా యంగ్ డైరెక్టర్ గా ఉన్న అనిల్ రావిపూడి హీరోగా ఎంట్రీ ఇవ్వడంపై రకరకాల వార్తలు వస్తుండగా..వాటికి చెక్ పెట్టాడు.
ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాను డైరెక్ట్ చేశారు అనిల్. వెంకటేష్ హీరోగా నటించిన ఈసినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా చేశారు. కామెడీ యాక్షన్ స్టొరీగా తెరకెక్కిన ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.