జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ కి బిగ్ షాక్... రాజమౌళి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు!

First Published Oct 24, 2022, 5:28 PM IST

ఆర్ ఆర్ ఆర్ చిత్రం జపాన్ బాక్సాఫీస్ వద్ద చతికలపడింది. ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ విపరీతంగా ప్రమోషన్స్ నిర్వహించినా పెద్దగా ప్రభావం చూపలేదు. అంచనాలు అందుకోలేక నిరాశపరిచింది. 
 

RRR


అక్టోబర్ 21న ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో విడుదలైంది. వీకెండ్ ముగియగా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. హాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమనుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ అక్కడ నయా రికార్డు సెట్ చేస్తుందని భావించారు. 


అలాగే రాజమౌళి సినిమా ప్రమోషన్స్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. జపాన్ మీడియాలో భారీగా ప్రమోట్ చేశారు. అక్కడ చిత్ర ప్రముఖుల సహాయం తీసుకున్నారు. ఫ్యాన్స్ తో ఫోటో షూట్లు, థియేటర్స్ విజిట్స్, ఇంటర్వ్యూలు ఇలా అన్ని మార్గాల్లో విపరీతమైన ప్రచారం కల్పించారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ చేయాల్సిన హంగామా మొత్తం చేశారు. 

ఇంత చేసినా చెప్పుకోదగ్గ ఫలితం దక్కలేదని వసూళ్ల లెక్కలు చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ డే ఆర్ ఆర్ ఆర్ కేవలం రూ. 1 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వీకెండ్  నిరాశాపూరితంగా ముగించింది. మూడు రోజులకు గాను ఆర్ ఆర్ ఆర్ సుమారు రూ.3.7  కోట్ల గ్రాస్ రాబట్టిందని సమాచారం. 
 

RRR Movie


జపాన్ బాక్సాఫీస్ ని ఆర్ ఆర్ ఆర్ దున్నేస్తుందని భావించిన మేకర్స్ ఓపెనింగ్ వసూళ్లు చూసి నిరాశ చెందినట్లు సమాచారం. ఇక జపాన్ లో  ¥ 400 మిలియన్ వసూళ్లతో రజినీకాంత్  ముత్తు చాలా కాలంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ఉంది. 

బాహుబలి 2 మాత్రమే ముత్తు దరిదాపుల్లోకి వెళ్ళగలిగింది. బాహుబలి 2 ¥ 300 మిలియన్ వసూళ్లు  అందుకుంది. బాహుబలి 2 జపాన్ లో వంద రోజులు ఆడింది. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ మూవీ బాహుబలి రికార్డు బద్దలుకొట్టినా కూడా పెద్ద విజయంగా చెప్పలేము. ఆర్ ఆర్ ఆర్ హైప్ కి దాన్ని సక్సెస్ గా అభివరించలేము. ఎప్పుడో దశాబ్దాల క్రితం రజనీ నెలకొల్పిన రికార్డు అలానే ఉంది. 
 


వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 1100 కోట్ల వసూళ్లు ఈ చిత్రానికి దక్కాయి. యూఎస్ లో $ 14 మిలియన్ వసూళ్లు అందుకుంది. హిందీ వర్షన్ రూ. 250 కోట్లకు పైగా రాబట్టింది. 
 

click me!