ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, రోజా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయింది. పార్టీ పనుల్లో కూడా పెద్దగా చురుగ్గా పాల్గొనడంలేదు రోజా. అంతే కాదు ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అటు తమిళ్, ఇటు తెలుగులో కూడా రోజా ఛాన్స్ ల కోసం చూసిందట. కాని మినిస్టర్ గా ఉన్నప్పుడు రజినీకాంత్ ను, టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీని నోటికొచ్చినట్టు తిట్టింది రోజా. ఆ ఎఫెక్ట్ తో ఆమెకు తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో సినిమా ఛాన్స్ లు రాలేదని సమాచారం.
Also Read: భర్త కోసం లవర్ ను సెట్ చేసిన భార్య, ఓటీటీలో రచ్చరచ్చ చేస్తున్న వెబ్ మూవీ, ఎక్కడ చూడొచ్చంటే?