ముసలావిడ గొంతుతో పాడిన కమల్
అలాగే కమల్ హాసన్ ఆడ గొంతులో పాడిన మరో పాట దశావతారం సినిమాలో ఉంది. ఈ సినిమాలో 10 వేర్వేరు పాత్రల్లో నటించిన కమల్ హాసన్, హిమేష్ రేష్మియా సంగీతంలో ముకుందా ముకుందా పాటను పాడారు. సాధనా సర్గంతో కలిసి ఆయన పాడిన ఈ పాటలో.. ముసలావిడ గెటప్‌లో వచ్చే కమల్ హాసన్ పాడినట్లు కొన్ని లైన్లు ఉంటాయి.
ఆ లైన్లను ఒక ముసలావిడ పాడితే ఎలా ఉంటుందో అదే విధంగా అద్భుతంగా పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు కమల్ హాసన్. ఈ రెండు పాటలకు ఉన్న సారూప్యత ఏమిటంటే, ఈ రెండు సినిమాలకు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించడం విశేషం. ఇలా కమల్ హాసన్ ఆడగొంతుతో పాడిన రెండు పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
Also Read:ఛావా OTT ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, రష్మిక , విక్కీ కౌశల్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?