ఐటమ్ సాంగ్స్ చేయాలంటే కండీషన్స్ ఒప్పుకోవాల్సిందే, రష్మిక మందన్న షరతులేంటో తెలుసా?

Published : Jan 21, 2026, 11:53 AM IST

సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన్న. నేషనల్ క్రష్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తానంటోంది. కానీ కొన్ని కండీషన్స్ తప్పనిసరి అంటా..?

PREV
16
పాన్ ఇండియా హీరోయిన్..

పాన్ ఇండియా లెవెల్‌లో.. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది రష్మిక మందన్న. ప్రస్తుతం బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రష్మిక మందాన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కన్నడ ఇండస్ట్రీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన రష్మిక మందాన, ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆతరువాత వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

ఛలో తరువాత రిలీజ్ అయిన గీత గోవిందం సినిమా రష్మికాను సెన్సేషనల్ స్టార్ గా మార్చింది. యూత్ ఆడియన్స్‌లో రష్మికకు తిరుగులేని ఇమేజ్ ను, ఫాలోయింగ్ ను తీసుకువచ్చింది. అక్కడి నుంచి ఆమె కెరీర్ మరింత బలపడుతూ.. ‘పుష్ప’ సిరీస్‌తో ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా మారింది రష్మికమందన్న.

26
లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కూడా సక్సెస్

ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా రష్మిక చేస్తున్న సినిమాలు మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నాయి. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కూడా సక్సెస్ ను సాధిస్తోంది రష్మిక. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రష్మిక వరుసగా స్టార్ హీరోల జోడీగా నటిస్తోంది. తెలుగులో అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది బ్యూటీ.. రీసెంట్ గా టాలీవుడ్‌లో ఆమె నటించిన ‘గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

36
స్పెషల్ సాంగ్స్ చేయాలంటే..?

స్టార్ హీరోయిన్లు చాలామంది స్పెషల్ సాంగ్స్ లో కూడా సందడి చేస్తుంటారు. అయితే రష్మిక మందన్న కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తుందేమో అని.. అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. ఆమె ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చింది. తాజాగా రష్మిక ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆమె తన కెరీర్ లక్ష్యాలు, సినిమాలు కథల ఎంపిక గురించి మాట్లాడింది. అంతే కాదు స్పెషల్ సాంగ్స్ గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. ఐటమ్ సాంగ్స్ చేయడానికి తాను రెడీగా ఉన్నానంటోన్న రష్మిక మందన్న.. అందుకోసం కొన్ని కండీషన్స్ ఉన్నాయంటోంది. ఇంతకీ అవి ఏంటంటే?

46
రష్మిక మందన్న మాట్లాడుతూ

రష్మిక మాట్లాడుతూ, '' నా అభిమానులకు, ఆడియన్స్ కు అందరికి నచ్చే సినిమాలు చేయాలి.. అన్ని జానర్స్‌లో వినోదాన్ని అందించడమే నా టార్గెట్.. అన్ని రకాల పాత్రలు చేయాలన్నదే నా గోల్. అందుకే కమర్షియల్, లవ్ స్టోరీ, లేడీ ఓరియెంటెడ్, హిస్టారికల్ అన్ని జానర్ సినిమాలు చేస్తున్నాను. ఇకపై కూడా ఇలాంటి కథలనే ఎంచుకుంటాను” అని క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ.. ''నాకు కూడా స్పెషల్ సాంగ్స్ చేయాలనే ఉంది. కానీ ఆ సినిమాలో హీరోయిన్‌గా నేనే ఉండాలి. అలా అయితే స్పెషల్ సాంగ్స్ చేస్తాను. లేకపోతే, కొందరు డైరెక్టర్ల కోసం నేను పెట్టుకున్న షరతును బ్రేక్ చేసి స్పెషల్ సాంగ్స్ చేస్తాను” అని చెప్పింది.

56
రెమ్యూనరేషన్ గురించి రష్మిక కామెంట్స్..

రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ప్రచారాలపై స్పందించిన రష్మిక, “ఇండియాలో నేనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ అని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. వారు ప్రచారం చేస్తున్నట్టుగా.. ఆ రూమర్ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ కామెంట్ చేసింది రష్మిక మందన్నా. విజయ్ దేవరకొండతో ప్రేమ, నిశ్చితార్థం, పెళ్లి విషయాలపై ప్రశ్నలకు స్పందిస్తూ, “సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను” అనిసమాధానం దాటవేసింది.

66
రష్మిక మందన్న సినిమాలు..

ఇక రష్మిక మందన్న చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో మైసా అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో కీలకపాత్రలో నటిస్తోంది నేషనల్ క్రష్.. అటు బాలీవుడ్‌లో ‘కాక్టెయిల్ 2’ చిత్రం కూడా చేస్తోంది. అంతేకాకుండా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,అట్లీ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో రష్మిక విలన్ పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం. వీటితో పాటు మరికొన్ని సినిమాల కథలను ఆమె పెండింగ్ లో పెట్టినట్టు సమాచారం. ఈ ఏడాది విజయ్ తో పెళ్లి జరిగితే.. రష్మిక సినిమాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories