చిరంజీవి ఇప్పుడు `మన శంకర వర ప్రసాద్ గారు` సక్సెస్ ఊపులో ఉన్నారు. ఇదే ఊపులో బాబీతో సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇందులో చిరంజీవి కూతురుగా స్టార్ హీరోయిన్ నటించబోతుందట.
మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ఏంటో చూపించిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటిని మించిన సినిమా వచ్చింది. `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ సంచలనం విజయం సాధించింది. ఇది సంక్రాంతి పండక్కి విడుదలైన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసుని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఇది మూడు వందల కోట్లుకుపైగా వసూళ్లని రాబట్టింది. చిరంజీవి తన రికార్డులను తానే బ్రేక్ చేసుకున్నాడు.
25
బాబీతో సినిమాకి రెడీ అవుతున్న చిరంజీవి
`మన శంకర వరప్రసాద్ గారు` సక్సెస్ ఆనందంలో ఉన్న చిరజంజీవి ఇప్పుడు నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో సినిమాని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో `వాల్తేర్ వీరయ్య` సినిమా వచ్చింది. అది కూడా సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా చేయబోతున్నారు. దుబాయ్‌లో ఈ మూవీ స్క్రిప్ట్ డిస్కషన్ జరిగిందట. ఓకే అయ్యిందని సమాచారం. ఇక షూటింగ్ ప్రారంభం కావడమే మిగిలింది.
35
చిరంజీవికి జోడీగా ఐశ్వర్యా రాయ్
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి ఎండింగ్‌లోగానీ, మార్చిలో గానీ సినిమాని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మార్చి నుంచి రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నట్టు సమాచారం. అలాగే హీరోయిన్‌గా ఐశ్వర్యా రాయ్‌ని అనుకున్నారట. ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యిందని సమాచారం. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. భారీ స్థాయిలో దీన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి మార్క్ మాస్ కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు ఉంటూనే బాబీ మార్క్ ఎమోషన్స్, స్టయిల్, యాక్షన్ ఉంటుందని సమాచారం.
ఇందులో కూతురు పాత్ర బలంగా ఉంటుందట. తండ్రి కూతుళ్ల బాండింగ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని, కూతురు పాత్ర కోసం అన్వేషిస్తున్నారట. అయితే ఆ పాత్రకోసం ఇద్దరు హీరోయిన్లని అనుకుంటున్నారట. ప్రధానంగా కృతి శెట్టి పేరు వినిపిస్తుంది. ఆమెతోపాటు అనస్వర రాజన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అనస్వర రాజన్ ఇటీవల `ఛాంపియన్` మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరిని కన్సిడర్ చేస్తున్నారని, వీరిలో ఒకరిని ఫైనల్ చేస్తారట. అయితే తెలుస్తోన్న సమాచారం ప్రకారం కృతి శెట్టి ఫైనల్ అయ్యిందని అంటున్నారు. త్వరలో ప్రకటన రాబోతుందని సమాచారం.
55
సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న కృతి శెట్టి
కృతి శెట్టి.. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన `ఉప్పెన` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. బేబమ్మగా ఇరగదీసింది కృతి. దీంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. వరుసగా ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలో పొరపాట్లు చేసింది. స్క్రిప్ట్ చూసుకోకుండా కాంబినేషన్స్ కి ప్రయారిటీ ఇచ్చింది. దీంతో ఆమె నటించిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. ఎంత వేగంగా ఎదిగిందో, అంతే వేగంగా డౌన్ అయ్యింది. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రయారిటీ ఇస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవి మూవీకి ఓకే చెప్పినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.