తన అవసరం కోసం వాడుకోవాలనుకున్న కృష్ణ, దిమ్మ తిరిగే ఝలక్ ఇచ్చిన హీరోయిన్.. దెబ్బకి సినిమా కూడా ఆగిపోయింది

Published : Jan 21, 2026, 11:26 AM IST

సూపర్ స్టార్ కృష్ణకి అగ్ర నటి ఒకరు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఆ హీరోయిన్ చేసిన పని వల్ల కృష్ణ సినిమానే ఆగిపోయింది. ఆ మూవీ ఏంటి, ఆ నటి చేసిన పని ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు

సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో అద్భుతమైన చిత్రాలని టాలీవుడ్ కి అందించారు. సాహసాలకు మారుపేరుగా నిలిచారు. సూపర్ స్టార్ కృష్ణతో శ్రీదేవి, జయప్రద లాంటి హీరోయిన్లు అనేక. అప్పటి అగ్ర నటి వాణిశ్రీతో కూడా కృష్ణ సినిమాలు చేశారు. సావిత్రి తర్వాత టాలీవుడ్ ని ఏలిన నటి అంటే వాణిశ్రీ పేరే చెబుతారు అందరూ. అలాంటి అగ్ర నటిని కృష్ణ, నాగేశ్వర రావు ఎప్పుడూ ప్రశంసించింది లేదట. ఈ విషయాన్ని వాణిశ్రీ స్వయంగా చెప్పారు.

25
వాణిశ్రీతో 30 ఏళ్ళు మాట్లాడని కృష్ణ

కనీసం కృష్ణ తన తో మాట్లాడేవారు కాదు అని వాణిశ్రీ అన్నారు. అది ఎందుకో నాకు కూడా తెలియదు. కానీ ఒకసారి మాత్రం కృష్ణ తన అవసరం కోసం ఫోన్ చేశారు అని వాణిశ్రీ అన్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన 30 ఏళ్లలో కృష్ణ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడడం అదే తొలిసారి. కృష్ణ గారు మాట్లాడుతూ.. వాణిశ్రీ నేను ఒక సినిమా చేస్తున్నా. అందులో నువ్వు నాకు తల్లిగా నటించాలి. దర్శకులు, నిర్మాతలు నువ్వు తల్లి పాత్ర వేస్తేనే బావుంటుంది అని అంటున్నారు. నాకు తల్లిగా నటిస్తావా అని అడిగారు. అది ఒక తమిళ రీమేక్ సినిమా.

35
కృష్ణకి ఝలక్ ఇచ్చిన వాణిశ్రీ

మీకు తల్లిగానా ? ఏం సినిమా అండీ అదీ. ఒకసారి నాకు చూపించండి అని అడిగా. ఆయన షో అరేంజ్ చేసి వాళ్ళ మనుషులతో థియేటర్ లోనే సినిమా చూపించారు. అది ఎంగా చిన్న రాసా అనే తమిళ చిత్రం. క్లైమాక్స్ లో తల్లే కొడుక్కి విషం పెట్టి చంపాలనుకునే పాత్ర. ఆ సినిమా చూసిన వెంటనే నేను అస్సలు నటించను. కుదరదని కృష్ణ గారికి చెప్పేయండి అని చెప్పా.

45
దెబ్బకి సినిమానే ఆగిపోయింది

వాణిశ్రీ ఝలక్ ఇవ్వడంతో కృష్ణ ఇక చేసేది లేక ఆ సినిమానే ఆపేశారు. ఆ తర్వాత అదే సినిమా మరో యంగ్ హీరో చేతుల్లోకి వెళ్ళింది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. ఆ సినిమా మరేదో కాదు అబ్బాయి గారు. కృష్ణ గారు పక్కన పెట్టేయడంతో ఈవీవీ సత్యనారాయణ ఆ చిత్రాన్ని వెంకటేష్ తో తెరకెక్కింది సూపర్ హిట్ అందుకున్నారు.

55
వెంకటేష్ కి జాక్ పాట్

వెంకటేష్ కి తల్లి పాత్రలో అప్పటి సీనియర్ నటి జయచిత్ర నటించారు. హీరోయిన్ గా మీనా నటించింది. అత్తా కోడళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్ అయ్యాయి. ఆ విధంగా వాణిశ్రీ తనకి నచ్చకపోవడంతో సూపర్ స్టార్ కృష్ణ సినిమా అయినప్పటికీ ధైర్యంగా రిజెక్ట్ చేశారు. దెబ్బకి సినిమా కూడా ఆగిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories