రష్మిక మందన్న ఫిట్‌నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా? ఆమె అంత ఫిట్ గా గ్లామర్ గా ఉండటానికి ఏం తింటుుంది. డైలీ తన లైఫ్ స్టైల్ లో స్పెషల్ గా ఏం చేస్తోంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక మందన్న చెప్పిన టాప్ సీక్రేట్.
రష్మిక శాకాహారి. ఈమధ్యనే ఆమె పూర్తి వెజిటేరియన్ గా మారిపోయింది. తన రోజును లీటరు నీటితో, ఆపిల్ సైడర్ వెనిగర్‌తో ప్రారంభిస్తుంది. ఇది జీర్ణక్రియకు మంచిది. ఓ ఇంటర్వ్యూలో తన డైట్, వ్యాయామం, బ్యూటీ సీక్రెట్స్ గురించి వెల్లడించింది రష్మిక.
25
రష్మిక దినచర్య
రష్మిక తన దిన చర్య గురించి మాట్లాడుతూ.. నిద్రలేవగానే లీటరు నీళ్లు తాగుతా. తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటా. ఈ మధ్యే శాకాహారిగా మారాను. కానీ వ్యాయామం తర్వాత గుడ్లు తింటాను అని రష్మిక చెప్పింది. డైలీ ఎక్కడున్నా కానీ వ్యాయామం మాత్రం తప్పకుండా చేస్తుందట.
35
రష్మిక ఒక రోజులో ఏం తింటారు?
రష్మికకు చాలా ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ అవకాడో టోస్ట్, కానీ డైటీషియన్ తిననివ్వరు. మధ్యాహ్నం సౌత్ ఇండియన్ ఫుడ్ తింటుంది రష్మిక. రాత్రికి తేలికపాటి భోజనం చేస్తారు. రష్మిక డైట్ లో అన్నం తక్కువగా తింటారు. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటారు.
రోజూ స్వీట్లు తినాలనిపిస్తుందని కాని అది కుదరని పని అని రష్మిక అన్నారు. టొమాటో, బంగాళదుంప, దోసకాయ, బెల్ పెప్పర్ వల్ల తనకు అలర్జీ ఉందట. చిలగడదుంప అంటే చాలా ఇష్టమట. కాని ఫిట్ నెస్ ను కాపాడుకోవడం కోసం ఆమె తనకు ఇష్టమైనవి త్యాగం చేస్తోంది.
55
చర్మ సంరక్షణ
షూటింగ్స్ వల్ల ఉదయం చేయడం కుదరకపోతే.. సాయంత్రం వర్కౌట్ చేస్తానని రష్మిక చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వ్యాయామం చేయడం మిస్ అవ్వదు స్టార్ హీరోయిన్. ఇక చర్మ సంరక్షణ కోసం ఉదయం ముఖం కడుక్కుని మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడుతుంది రష్మిక మందన్న.