ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ భూమి పెడ్నేకర్ (కణికా కపూర్ పాత్రలో), షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుశా కపిలా, షిబానీ బేడీ, ప్రకాష్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించగా, అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. కథాపరంగా ఈ సినిమా ఫీమేల్ ప్లెజర్, లవ్, లస్టు, సెల్ఫ్ డిస్కవరీ, ఫ్రెండ్షిప్ వంటి అంశాలను స్పష్టంగా, ధైర్యంగా చూపిస్తుంది. ఈ సినిమా ప్రీమియర్ టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో జరిగింది.