పని పాటా లేనోళ్లే బిగ్ బాస్ చూస్తారు.. బిగ్ బాస్ విన్నర్ సెన్సేషనల్ కామెంట్స్

Published : Sep 18, 2025, 04:25 PM IST

Kaushal Manda: బిగ్ బాస్ తెలుగు 2 విన్నర్ కౌశల్ మరోసారి వార్తల్లో నిలిచారు. పని పాటా లేనోళ్లే బిగ్ బాస్ చూస్తారంటూ బిగ్ బాస్ 9పై షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

PREV
15
బిగ్ బాస్ పై బిగ్ బాస్ విన్నర్ సెన్సేషనల్ కామెంట్స్

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్‌ గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఎంతో పాపులర్ అయ్యింది. ఇండియాలో తొలుత హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో తరువాత ఇతర భాషల్లోకి వచ్చింది. కోట్లాది ఫ్యాన్స్ ను రియాలిటీ షో సొంతం చేసుకుంది. చాలామంది బిగ్ బాస్ షో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారు. కానీ, అదే స్థాయిలో ఈ షోపై నెగిటీవి కూడా ఉంది. కంటెస్టెంట్లు దరిద్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇక షోలో పాల్గొన్న వాళ్లల్లో కొంత బరితెగించేస్తున్నారనే విమర్శలు చాలానే ఉన్నాయి. కొంతమంది నటులకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి బిగ్ బాస్ షోపై ఓ బిగ్ బాస్ సీజన్ విన్నర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

25
బిగ్ బాస్ 2 విజేత కౌశల్ మండా కామెంట్స్

బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది ఎవరో కాదు. బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 2 విజేత కౌశల్ మండా. సీజన్ 2లో కౌశల్‌కు అసాధారణమైన ఫ్యాన్ బేస్ (Kaushal Army) ఏర్పడింది. ఆయన గెలుపు పూర్తిగా ప్రేక్షకుల మద్దతు వల్లే అని అందరూ ఒప్పుకున్నారు. కౌశల్ బిగ్ బాస్ షోతో క్రేజ్ దక్కించుకున్నప్పటికీ ఈషోకి రాకముందు దాదాపు 80పైగా సినిమాల్లో నటించారు. అందులో కొన్ని అడల్ట్ మూవీస్ ఉన్నాయి. అయితే అన్ని సినిమాల్లో నటించిన కౌశల్ ‌కి సరైన గుర్తింపు లభించలేదు. ఇక బిగ్ బాస్ తరువాత అయితే మనోడి రాత మారుతుందని చాలా మంది భావించారు. కానీ, కౌశల్ ఎప్పుడూ ముక్కుసూటిగా, షాకింగ్ వ్యాఖ్యలు చేయడంతో నిలుస్తుంటారు.

35
బిగ్ బాస్‌ 9 అగ్నిపరీక్షపై షాకింగ్ కామెంట్స్

ఇటీవల బిగ్ బాస్‌ 9 అగ్నిపరీక్ష (Bigg Boss Aagnipariksha)పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో కామన్ ఆడియన్స్‌కి అవకాశం ఇవ్వడం మంచి నిర్ణయం అని ఆయన ప్రశంసించినా, జడ్జీల ఎంపిక విధానంపై మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కౌశల్ మాట్లాడుతూ కామన్ ఆడియన్స్‌ని బిగ్ బాస్‌ హౌస్‌లోకి పంపడం మంచి నిర్ణయం. వేలాదిమంది అప్లై చేసుకున్నప్పటికీ, వారిలో 45 మందిని సెలక్ట్ చేసి, వారి మాట, ఆట తీరు బట్టి జడ్జీలు ఎంపిక చేస్తున్నారు. కానీ, జడ్జీల విషయంలో అభ్యంతరం ఉంది. అభిజిత్ బిగ్ బాస్ 4 విజేత, కాబట్టి సరే, బిందు మాధవి ఓటీటీ విజేత ఓకే. కానీ, నవదీప్ సీజన్ 1లో మూడో స్థానం నిలిచాడు. ఒక ఓడిపోయిన వ్యక్తిని కాకుండా, అప్పటి విజేత శివబాలాజీని తీసుకుని ఉంటే బాగుండేది. అలా చేస్తే విన్నర్స్‌కి గౌరవం దక్కేది.” అని కౌశల్ మండిపడ్డారు.

45
నన్నెందుకు పిలవలేదంటే..

కౌశల్ తనను ఎందుకు ఎప్పుడూ బిగ్ బాస్‌ హౌస్‌కి తిరిగి పిలవలేదో కూడా స్పష్టంగా చెప్పారు. “నేను గెలవడం బిగ్ బాస్‌ టీమ్‌కి అస్సలు నచ్చలేదు. ప్రేక్షకులే నన్ను గెలిపించారు. ఓట్ల విషయంలో నేను, నా తర్వాతి కంటెస్టెంట్స్‌ మధ్య ‘నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా’ ఉంది. దాంతో, తప్పనిసరిగా నన్ను విజేతగా ప్రకటించక తప్పలేదు. అందుకే బిగ్ బాస్‌ చరిత్రలో తొలిసారిగా హోస్ట్ విజేత చెయ్యి పట్టుకుని ప్రకటించకుండా, డైరెక్ట్ స్క్రీన్ మీద విన్నర్ అని చూపించారు. దీని ద్వారానే వారు నా విజయం అంగీకరించలేదని అర్థమవుతుంది. అందుకే ఇకపై నన్ను ఎప్పుడూ హౌస్‌లోకి పిలవలేదు.” అని ఆయన స్పష్టం చేశారు.

55
పనీ పాటా లేనోళ్లే బిగ్ బాస్ చూస్తారు.

తాజాగా బిగ్ బాస్ సీజన్ 9పై కౌశల్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోలో మాట్లాడుతూ.. ప్రజెంట్ సీజన్ ను చూడడం లేదని, కానీ అప్పుడప్పుడు ప్రోమోలు చూస్తున్ననంటూ వ్యంగంగా కామెంట్స్ చేశారు. 

‘బిగ్ బాస్ 9 లో సెలబ్రిటీలు, కామనర్స్ ను కలిపి పంపించారు. అసలు బిగ్ బాస్ షోలో పూర్తిగా సెలబ్రిటీలు ఉంటేనే చూడటం లేదు. అలాంటిది కామనర్స్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే ఎవరు చూస్తారు ? బిగ్ బాస్ హౌస్ లో ఎవరైన ఫేవరెట్ యాక్టర్స్ ఉంటే వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఇతరులతో ఎలా నడుచుకుంటున్నారు? వాళ్లు స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎలా రియాక్ట్ అవున్నారనే విషయాలను చూడడానికి బిగ్ బాస్ షోను చూస్తారు? అంటూ ప్రశ్నించారు.

‘అలాంటిది కామనర్స్ ని బిగ్ బాస్ లో పెడితే.. ఎవరు చూస్తారు? కామనర్స్ ఎలా ఉంటే ఏంటీ? ఇలాంటి బిగ్ బాస్ షోను చూస్తున్నారంటే.. వారికి జీవితంలో ఎలాంటి పనీ పాటా లేదని అర్థం చేసుకోవచ్చు. ఎదిఏమైనా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాబట్టి.. కామనర్స్ అందరూ తలుచుకుంటే సెలబ్రిటీలు ఎగిరిపోతారు. ఈ సీజన్లో కామనర్స్ మైండ్ గేమ్ ఆడితే ట్రోపీ 100% వారికి వస్తుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories