Rashmika Mandanna: విజయ్‌ దేవరకొండతో పెళ్లి.. ఫస్ట్ టైమ్ ఓపెన్‌ అయిన రష్మిక మందన్నా

Published : Jan 24, 2026, 08:29 PM IST

 Rashmika Mandanna: రష్మిక మందన్నా,  విజయ్ దేవరకొండ జంట ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై తాజాగా రష్మిక మందన్నా స్పందించింది.  

PREV
15
గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌లో కలిసి నటించిన రష్మిక, విజయ్‌

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కలిసి `గీత గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాల్లో నటించారు. అప్పట్నుంచి వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. స్నేహం బలపడింది. అయితే అది ప్రేమగా మారిందనే వార్తలు వినిపించాయి. చాలా కాలంగా వీరిద్దరి లవ్‌ స్టోరీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. 

25
డేటింగ్‌పై హింట్‌

ఈ ఇద్దరు కలిసి చాలా సార్లు వెకేషన్‌కి వెళ్లారు. ఒకే సమయంలో ఎయిర్‌పోర్ట్ లో కనిపించడం చాలా సార్లు జరిగింది. అంతేకాదు, ఒకే వెకేషన్‌లోనూ కనిపించారు. హింట్‌ ఇచ్చేలా ఆ వెకేషన్‌ ఫోటోలను పంచుకున్నారు. కానీ రహస్యం మెయింటేన్‌ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు విజయ్‌ దేవరకొండ ఇంట్లోనూ చాలా సార్లు కనిపించింది రష్మిక. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది. 

35
రహస్యంగా రష్మిక, విజయ్‌ ఎంగేజ్‌మెంట్‌

అయితే ఆ మధ్య ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్‌ జరిగిందనే వార్తలు వచ్చాయి. విజయ్‌ ఇంట్లో చాలా రహస్యంగా ఇద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. కానీ ఆ వార్తలు బయటకు చెప్పలేదు. అధికారికంగా ప్రకటించలేదు. దాన్ని రహస్యంగానే ఉంచాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు మ్యారేజ్‌ వార్తలు ఊపందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరి పెళ్ళికి సంబంధించి వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

45
ఫిబ్రవరిలో పెళ్లి

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంట ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని, వీరిది డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అని ప్రచారం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా కూడా ఎవరూ రియాక్ట్ కాలేదు. ఈ వార్తలను ఖండించలేదు. అంటే ఇది నిజమే అని అంతా ఫిక్స్ అయ్యారు. ఉదయ్‌ పూర్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేశారట. 

55
విజయ్‌ తో పెళ్లి, రష్మిక ఏం చెప్పిందంటే?

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెకి ఈ ప్రశ్న ఎదురయ్యింది. దీనికి రష్మిక మందన్నా రియాక్ట్ అయ్యింది. తన పెళ్లికి సంబంధించిన చాలా సార్లు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఎవరికి వారు తమకు నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. దీనిపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. నేను పెళ్లి చేసుకుంటే అందరికి చెప్పే చేసుకుంటాను అని తెలిపింది. చాలా క్లెవర్‌గా ఆన్సర్‌ ఇచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పలేదు, ఖండించలేదు. టైమ్‌ వచ్చినప్పుడు తానే ప్రకటిస్తానని చెప్పింది రష్మిక.  పరోక్షంగా మరోసారి ఆమె హింట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories