మన శంకర వరప్రసాద్ గారు నిజంగానే రీజినల్ ఇండస్ట్రీ హిట్ సినిమానా ? టాప్ 3 మూవీస్ ఇవే

Published : Jan 24, 2026, 07:03 PM IST

చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ చిత్రం రీజినల్ ఇండస్ట్రీ హిట్ అని అంటున్నారు. అది నిజమా కాదా ? ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
చిరంజీవి సినిమా కోసం క్యూ కట్టిన ఆడియన్స్ 

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం చిరంజీవి అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఉర్రూతలూగించింది. చాలా కాలం తర్వాత చిరంజీవి మునుపటి మెగాస్టార్ లా తెరపై కనిపించడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి తెరకెక్కించిన విధానం, పాటలు అన్నీ చాలా బాగా కుదిరాయి. 

25
రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా సరికొత్త రికార్డ్ 

దీనితో ఈ మూవీ వారం లోపే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బయ్యర్లు, నిర్మాతలు మంచి లాభాలు పొందుతున్నారు. దాదాపు 120 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ ని ఈ మూవీ కేవలం వారం ;లోపే అందుకోవడం మైండ్ బ్లోయింగ్ రికార్డ్ అని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం రీజినల్ ఇండస్ట్రీ హిట్ మూవీ పండితులు, అభిమానులు చెబుతూ వస్తున్నారు. అయితే నిజంగానే మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రీజినల్ ఇండస్ట్రీ హిట్ అయిందా ? నిజమైన కలెక్షన్స్ ఎంత ? అనే వివరాలు పరిశీలిస్తే.. అవును నిజమే.. మన శంకర వరప్రసాద్ గారు రీజినల్ ఇండస్ట్రీ హిట్ మూవీగా రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు ఆ రికార్డు అల్లు అర్జున్, వెంకటేష్ పేర్లపై ఆ రికార్డ్ ఉండేది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి టాప్ ప్లేస్ కి చేరుకొని తన సత్తా చాటారు. మన శంకర వరప్రసాద్ గారు మూవీతో పాటు అల్లు అర్జున్, వెంకటేష్ సినిమాల కలెక్షన్స్ ఇప్పుడు పరిశీలిద్దాం. 

35
మన శంకర వరప్రసాద్ గారు

చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం 12 రోజుల్లో దాదాపు 255 కోట్ల గ్రాస్ సాధించింది. షేర్ వాల్యూ 160 కోట్ల వరకు ఉంది. ఇది రీజినల్ సినిమాల్లో ఆల్ టైం రికార్డ్. అందుకే ఈ చిత్రం రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ వసూళ్లు రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం లాంగ్ వీకెండ్ నడుస్తోంది. 

45
అల వైకుంఠపురములో 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లోని అల వైకుంఠపురంలో చిత్రం 250 కోట్ల వరకు గ్రాండ్ సాధించింది. షేర్ వాల్యూ 155 కోట్ల వరకు ఉంటుంది. 

55
సంక్రాంతికి వస్తున్నాం 

ఈ మూవీ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కినదే. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 245 కోట్ల గ్రాస్ రాబట్టింది. షేర్ వాల్యూ 150 కోట్ల వరకు ఉంటుంది.  

రీజనల్ గా అత్యధిక వసూళ్లు సాధించిన ఈ మూడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయినవే. 

Read more Photos on
click me!

Recommended Stories