Border 2 collections: బార్డర్ 2 ఫస్ట్ డే వసూళ్లు, `ధురంధర్‌` రికార్డు బ్రేక్‌.. సన్నీ డియోల్ మూవీ కలెక్షన్ల సునామీ

Published : Jan 24, 2026, 06:40 PM IST

Border 2 collections: సన్నీ డియోల్‌, వరుణ్‌ దావన్‌ వంటి వారు కలిసి నటించిన `బార్డర్‌ 2` సినిమా శుక్రవారం విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రం మొదటి రోజు అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. `ధురంధర్‌` రికార్డుని బ్రేక్‌ చేసింది. 

PREV
15
సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న `బార్డర్‌ 2`

సన్నీడియోల్‌, వరుణ్‌ ధావన్‌, దిల్జిత్ దోసాంజే, అహన్‌ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం `బార్డర్‌ 2`. అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. 1971లో ఇండియా పాకిస్తాన్‌ మధ్య జరిగి యుద్ధం ప్రధానంగా చేసుకుని, ఎపిక్‌ యాక్షన్‌ వార్ ఫిల్మ్ గా  రూపొందింది. రిపబ్లిక్‌ డేని పురస్కరించుకుని శుక్రవారం ఈ మూవీ విడుదలయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది.  సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ వసూళ్ల పరంగా సత్తా చాటింది. 

25
ధురంధర్‌ రికార్డుని బ్రేక్‌ చేసిన బార్డర్‌ 2

'బార్డర్ 2' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా  సుమారు రూ.41 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.  ఓవర్సీస్  లో ఇది రూ. 5 కోట్లు వసూళ్లు చేసింది. భారత్‌లో సినిమా గ్రాస్ కలెక్షన్లు రూ.36 కోట్ల వరకు ఉండటం విశేషం.  ఈ మూవీ ఇటీవల సంచలనం సృష్టించిన `ధురంధర్‌` కంటే ఎక్కువ ఓపెనింగ్స్ ని రాబట్టడం విశేషం. `ధురంధర్‌` తొలి రోజు రూ.28కోట్ల ఇండియా నెట్‌, దాదాపు నలభై కోట్ల వరకు వరల్డ్ వైడ్‌ కలెక్షన్లని సాధించింది. ఇప్పుడు `బార్డర్‌ 2` దాన్ని మించి వసూలు చేయడం విశేషం. దీంతో ఈ మూవీ బాలీవుడ్‌లో మరో సంచలనంగా నిలవబోతుందని చెప్పొచ్చు. 

35
రెండో రోజు సత్తా చాటబోతున్న `బార్డర్‌ 2`

శుక్రవారం లాగానే శనివారం కలెక్షన్లు కూడా భారీగా ఉండబోతున్నాయట. సుమారు నలభై కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోయిమోయి రిపోర్ట్ ప్రకారం, 'బార్డర్ 2' రెండో రోజుకు సుమారు 4.68 లక్షల టిక్కెట్లు అడ్వాన్స్‌గా అమ్ముడయ్యాయి. వీటిలో 1.91 లక్షల టిక్కెట్లు నేషనల్ సినిమా చైన్స్‌లో బుక్ అయ్యాయి. ఇందులో పీవీఆర్‌లో 1 లక్ష, ఐనాక్స్‌లో 65 వేలు, సినీపోలిస్‌లో 26 వేల టిక్కెట్లు ఉన్నాయి.

45
రెండో రోజు కలెక్షన్ల అంచనా

 'బార్డర్ 2' రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు 15.34 కోట్ల రూపాయలు సంపాదించింది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌తో పోలిస్తే ఇది దాదాపు 22.72 శాతం ఎక్కువ.  ఈ సినిమా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు 12.5 కోట్లు సంపాదించింది.

55
బార్డర్‌ 2 బడ్జెట్‌

జె.పి. ఫిల్మ్స్, టి-సిరీస్ బ్యానర్‌పై నిర్మించిన 'బార్డర్ 2' బడ్జెట్ సుమారు 275 కోట్ల రూపాయలు. అనురాగ్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాలో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. దేశభక్తి నేపథ్యంలో, వార్‌ ప్రధానంగా సాగే ఈ మూవీలో ఎమోషన్స్ కీలకంగా ఉన్నాయి. యాక్షన్‌ పార్ట్ మరింతగా ఆకట్టుకునేలా ఉంది. ఇది నార్త్ ఆడియెన్స్ ని బాగా అలరిస్తోంది. అందుకే బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories