బన్నీ స్టార్ కావడం చిరంజీవికే పెద్ద షాక్.. కమెడియన్ మనవడు ఈ స్థాయికి, మెగా హీరోలంతా..

First Published Aug 25, 2021, 7:24 PM IST

ట్విట్టర్ లో కామెంట్స్, మీడియా ఇంటర్వ్యూలలో తనదైన శైలిలో వర్మకు వెన్నతో పెట్టిన విద్య. వివాదాస్పద అంశాలలో తలదూర్చడం, వివాదాలను సృష్టించడం వర్మకు మామూలు విషయం.

ట్విట్టర్ లో కామెంట్స్, మీడియా ఇంటర్వ్యూలలో తనదైన శైలిలో వర్మకు వెన్నతో పెట్టిన విద్య. వివాదాస్పద అంశాలలో తలదూర్చడం, వివాదాలను సృష్టించడం వర్మకు మామూలు విషయం. రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో మెగా హీరోలంతా పారా సైట్స్.. అల్లు అర్జున్ మాత్రం అసలైన మెగాస్టార్ అంటూ చేసిన కామెంట్స్ రచ్చ సృష్టిస్తున్నాయి. 

వీటిపై వర్మ ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని అన్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. 

చిరు బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఒక్క అల్లు అర్జున్ తప్ప మిగిలిన మెగా హీరోలంతా కనిపించారు. వివిధ కారణాల వల్ల బన్నీ.చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ కి హాజరు కాలేదనే వాదన వినిపిస్తోంది. దీనిపై రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. 

అల్లు అర్జున్ సెల్ఫ్ మేడ్ స్టార్. అందుకనే బన్నీ.. చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ కు హాజరు కాలేదు. పవన్ కళ్యాణ్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి వారంతా చిరంజీవి లేకపోతే తాము లేము అని చెప్పుకునే పారా సైట్స్ అని వర్మ వ్యాఖ్యలు చేశాడు. 

దీనిపై ఆర్జీవీ ఇంటర్వ్యూలో వివరణ ఇస్తూ.. బన్నీ.. అల్లు రామలింగయ్య అనే కమెడియన్ కి గ్రాండ్ సన్. అల్లు, మెగా ఫ్యామిలీలో ఉన్న పాలిటిక్స్ గురించి నాకు తెలియదు. హీరోల కొడుకులు హీరోలు కావడం సాధారణం. కానీ అల్లు అర్జున్ కమెడియన్ మనవడిగా ఈ స్థాయికి ఎదిగాడు. చిరు బర్త్ డే సెలెబ్రేషన్స్ కి బన్నీ వెళ్లాడా లేదా అనేది నాకు అనవసరం. 

ఒకరిమీద ఆధారపడి బతికేవాళ్ళే పారా సైట్స్. పవన్ కళ్యాణ్, రాంచరణ్, వరుణ్, తేజు లాంటి వాళ్లంతా చిరంజీవి లేకపోతే మేము లేము అని వాళ్లే చెబుతున్నారు. కానీ బన్నీ నుంచి నేను అలాంటి మాటలు ఎప్పుడూ వినలేదు. చిరంజీవిని గౌరవిస్తా అని మాత్రం చెప్పాడు. 

చిరంజీవి వల్ల గంగోత్రి చిత్రంలో బన్నీని ప్రేక్షకులు ఆదరించలేదు. బన్నీనే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. చిరంజీవి ప్రమేయం ఉన్నా లేకున్నా అల్లు అర్జున్ స్టార్ డమ్ అలాగే ఉంటుంది. అల్లు అర్జున్ స్టార్ కావడం అందరికన్నా చిరంజీవికే పెద్ద షాక్.. నా మాటలకు అర్థం సర్ ప్రైజ్ అని వర్మ తెలిపాడు. 

click me!