3000 మంది ఆర్టిస్టులతో భారీ షెడ్యూల్, మహేష్ బాబు సినిమా కోసం RTO ఆఫీస్ కి రాజమౌళి

Published : Apr 24, 2025, 08:48 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు,  రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ భారీ స్థాయిలో జరుగుతోంది. పక్కా ప్లానింగ్ తో, అనుకున్న లొకేషన్లలో షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు జక్కన్న. ఇక 3000 మంది ఆర్టిస్ట్ లతో భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశాడట రాజమౌళి. అంతే కాదు మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో ప్రత్యక్ష్యం అయ్యాడు కారణం ఏంటంటే? 

PREV
16
3000 మంది ఆర్టిస్టులతో భారీ షెడ్యూల్, మహేష్ బాబు సినిమా కోసం RTO ఆఫీస్ కి రాజమౌళి

 సూపర్ స్టార్ మహేష్ బాబు,దర్శక ధీరుడు రాజమౌళి  కాంబినేషన్ లో భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. ఈమూవీ షూటింగ్ షెడ్యూల్  ఒడిశా లో  పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ తరువాత మహేష్ బాబు ఫ్యామిలీతో సమ్మర్ టూర్ కు వెళ్ళాడు, రీసెంట్ గానే మళ్లీ ఆయన హైదరాబాద్ లో అడుగు పెట్టినట్టు సమాచారం. ఇక తరువాత షెడ్యుల్ ను  త్వరలోనే హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో.. కంటీన్యూగా  నెల రోజుల పాటు చేయబోతున్నారట. 

Also Read: స్టార్ హీరోయిన్ కు విలన్ గా, ప్రియుడి గా నటించిన చిరంజీవి, ఎవరా నటి?
 

26

అంతే కాదు ఈ షెడ్యుల్ లో  ఒక భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేయబోతున్నారు. హీరో, హీరోయిన్  మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాటు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఈషెడ్యుల్ లో భాగం కాబోతున్నారు. అంతే కాదు ఈ భారీ యాక్షన్ సీన్ కోసం 3 వేల మంది ఆర్టిస్టులను రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎక్కడా చూడని విధంగా ఈ యాక్షన్ సన్నివేశం ఉంటుందని టాక్. 

Also Read:  మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పేరు తెలిస్తే షాక్ అవుతారు.

36

ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆతరువాత జరగబోయే షూటింగ్ మరో ఎత్తు. హైదరాబాద్ లో ఈ భారీ యాక్షన్ సీన్ తరువాత  మూవీ టీమ్ అంతా ఫారెన్ ప్లైట్ ఎక్కేయబోతున్నారు. ఇక ఆతరువాత  షూటింగ్ అంతా విదేశీ అడవుల్లో షూటింగ్ చేయబోతున్నారు.  అమెజాన్ అడవుల్లో  భారీ అడ్వెంచర్ షూట్ కోసం రెడీ అవుతున్నారు జక్కన్న టీమ్. ఇక విదేశాల్లో షూటింగ్ అంటే ఎక్కువ రోజులు అక్కడ ఉండాల్సి వస్తుంది. దాంతో అక్కడ తిరగాలంటే.. బైక్ కాని, కార్ కాని కంపల్సరీ వాడాలి. 

Also Read:  50 ఏళ్ల మహేష్ బాబు, 65 ఏళ్ల నాగార్జున యంగ్ లుక్ సీక్రెట్ ఏంటి, గ్లామర్, ఫిట్ నెస్ కోసం ఏం తింటారు?

46

అందుకోసంగా రాజమౌళి  తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ని రెన్యువల్ చేయించుకోవడం కోసం  ఖైరతాబాద్ RTO ఆఫీస్ కి వెళ్ళాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సౌత్ ఆఫ్రికా తో పాటు, ఇతర ముఖ్యమైన దేశాల్లో ఉన్న దట్టమైన అడవుల్లో నెలల తరబడి షూటింగ్ చేయబోతున్నారు. అందుకోసం ఫుల్ గా ప్రిపేర్ అయ్యారు టీమ్. అందుకే జక్కన్న కూడా ఇలా తన లైసెన్స్ ను రెన్యువల్ చేసుకుని సిద్దంగా ఉన్నారు. 

Also Read: సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?

56
ss rajamouli mahesh babu movie ssmb 29 will have a massive 1000 crore budget

ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు జపాన్ లో  స్పెషల్ గా మార్షల్ ఆర్ట్స్  లో ట్రైనింగ్ అయ్యి ఉన్నారు. అదే విధంగా ట్రైబ్ లాగ్వేజ్ ను కూడా ఆయన కాస్త నేర్చుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి వారి స్లాంగ్ ను ప్రాక్టీస్ చేవాడట మహేష్ బాబు.  పాన్ వరల్డ్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నన్న ఈ సినిమా..ఫస్ట్ డే  వెయ్యి కోట్ల  గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టేల  ప్లాన్ చేసినట్టు సమాచారం. 

Also Read: స్టార్ హీరోయిన్ కు విలన్ గా, ప్రియుడి గా నటించిన చిరంజీవి, ఎవరా నటి?

66
Rajamouli, mahesh babu, Priyanka chopra, SSMB29

ఈ సినిమాలో పులులు, సింహాలు తో పాటు  డైనోసర్స్ తో కూడా  మహేష్ బాబు యాక్షన్ సీన్స్ ఉన్నాయట. ఎవరు  ఊహించని విధంగా  ఈసినిమాలో ట్వీస్ట్ లను ఆడియన్స్ చూడబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈసారి ఎట్టిపరిస్థితుల్లో పోస్ట్ పోన్ లు లేకుండా  2027 మార్చిలో ఈ మూవీని రిలీజ్ చేయడమే టార్గెట్ గా  రాజమౌళి సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories