Chiranjeevi Once Played a Villain to This Star Heroine
టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగు వెలితారు చిరంజీవి. 90స్ లో ఇండస్ట్రీని ఏలిన చిరు.. సుప్రీమ్ హీరోగా.. ఆతరువాత మెగాస్టార్ గా సత్తా చాటారు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అడుగు పెట్టిన చిరంజీవి, ప్రస్తుతం టాలీవుడ్ ను రూల్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు చిరు. మెగా ఫ్యామిలీ నుంచి స్టార్స్ ను రంగంలోకి దింపి.. టాలీవుడ్ లో మెగాసామ్రాజ్యాన్ని స్థాపించారు. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించిన మెగాస్టార్.. ఆతరువాత హీరోగా అవకాశాలు అందిపుచ్చుకున్నారు.
Also Read: మహేష్ బాబు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా? ఆమె పేరు తెలిస్తే షాక్ అవుతారు.
చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందే.. శీదేవి ఇండస్ట్రీలో హీరోయిన్ గా స్టార్ డమ్ చూసింది. అంతే కాదు శ్రీదేవి నటించిన రాణీకాసుల రంగమ్మ, మోసగాడు లాంటి సినిమాల్లో మెగాస్టార్ నెగెటీవ్ రోల్ ను పోషించారు. ఆతరువాత కాలంలో చిరంజీవి హీరోగా స్టార్ డమ్ అందుకోవడంతో పాటు శ్రీదేవి జోడీగా జగదేక వీరుడు.. అతిలోక సుందరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందించారు.
Also Read: సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?
chiranjeevi
అలా చిరంజీవి స్టార్ హీరోయిన్ అయిన శ్రీదేవికి విలన్ గా నటించడంతో పాటు హీరోగా కూడా హిట్స్ అందించారు. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. వశిస్ట్ డైరెక్ట్ చేసిన ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇక నెక్ట్స్ అనిల్ రావిపూడితో ఓ సినిమా ప్లాన్ చేసిన మెగాస్టార్.. మరోవైపు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదేల్ తో కూడా మరో మూవీ కమిట్ అయ్యాడు. ఈసినిమాను నాని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక శ్రీదేవి మాత్రం రీ ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలానికే మరణించారు. 54 ఏళ్ళ వయస్సులో దుబాయ్ లోని ఓ హోటల్ లోని బాత్ రూమ్ లో అనుమానస్పద పరిస్థితుల్లో శ్రీదేవి మరణించారు.