అవును తారక్ తో స్టూడెంట్ నెంబర్ 1 రాజమౌళి ఫస్ట్ మూవీ. అయితే ఈసినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనిచెప్పగానే.. అప్పుడు తారక్ చాలా చిన్నగా కనిపించాడట. వచ్చీ రాని మీసాలు.. డింగ్ డింగ్ అంటూ.. సరిగ్గా నడవటం కూడా రాదు.. వీడెక్కడ దొరికాడు రా నాకు.. సినిమా ఎలా చేయాలి అనిపించిందట.
అయితే తను నమ్మిన సిద్దాంతం ప్రకారం కుంటి గుర్రంతో రేసు గెలవాలి.. అలా గెలిచినవాడే నిజమైన సక్సెస్ ను అందుకున్న ఫీలింగ్ వస్తుంది అన్నారు జక్కన్న. అయితే ఎన్టీఆర్ విషయంలో తాను అనుకున్నది రాంగ్ అని తరువాత తనకు తెలిసిందట.
సినిమా స్టార్ట్ అయ్యి ఓ నాలుగైదు సీన్లు చేయగానే.. అతను ఎంత అద్భుతమైన యాక్టర్ అనేది తనకు అర్ధం అయ్యిందట. ఇక అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ నువదిలిపెట్టలేదట రాజమౌళి.
Al so Read: రోజుకు 200 సిగరెట్లు తాగే అమితాబ్ బచ్చన్